Immunity Foods: సీజనల్ వ్యాధుల్నించి రక్షించుకోవాలంటే..డైట్‌లో ఈ ఫుడ్స్ తప్పనిసరి

Immunity Foods: సీజన్ మారేకొద్దీ వివిధ రకాల వ్యాధుల ముప్పుు పెరుగుతుంటుంది. తీసుకునే డైట్ ఆరోగ్యంగా ఉంటే..ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటుంది. ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా సరిచేసుకోవచ్చు. ఇమ్యూనిటీ కోసం ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 11, 2023, 05:42 PM IST
Immunity Foods: సీజనల్ వ్యాధుల్నించి రక్షించుకోవాలంటే..డైట్‌లో ఈ ఫుడ్స్ తప్పనిసరి

మారుతున్న సీజన్‌లో వ్యాధుల సమస్యలు పెరుగుతుంటాయి. ఇమ్యూనిటీ బలంగా ఉంటే..వ్యాధుల్నించి పోరాడే సామర్ధ్యం కలుగుతుంది. అందుకే బలమైన ఇమ్యూనిటీ కోసం బలవర్ధకరమైన ఆహారముండాలి. ఇమ్యూనిటీ బలంగా ఉండాలంటే..జీవనశైలిలో కొన్ని మార్పులు తప్పకుండా ఉండాలి. 

ఇమ్యూనిటీ పటిష్టత కోసం తీసుకోవల్సిన ఆహార పదార్ధాలు

సిట్రస్ ఫ్రూట్స్

శరీరంలో ఇమ్యూనిటీ పెరిగేందుకు సిట్రస్ ఫుడ్స్‌ను డైట్‌లో భాగంగా చేసుకోవడం అవసరం. సిట్రస్ ఫ్రూట్స్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి ఇందుకు దోహదపడుతుంది. అందుకే నిమ్మ, ద్రాక్ష, ఆరెంజ్ వంటి ఫ్రూట్స్ అధికంగా తీసుకోవాలి.

రెడ్ సిమ్లా మిర్చ్

విటమిన్ సి అనేది కేవలం పుల్లటి పదార్ధాల్లోనే కాదు..రెడ్ సిమ్లా మిర్చిలోనే కూడా పుష్కలంగా ఉంటుంది. రెడ్ సిమ్లా మిర్చిని డైట్‌లో భాగం చేసుకుంటే..విటమిన్ సి పుష్కలంగా లభించడమే కాకుండా..బీటా కెరోటిన్ పెద్దమొత్తంలో లభిస్తుంది. ఫలితంగా ఇమ్యూనిటీ వృద్ధి చెందుతుంది. 

బ్రోకలీ

బ్రోకలీలో విటమిన్ ఎ, సి, చాలా ఎక్కువగా లభిస్తుంది. దీంతోపాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. తరచూ వ్యాధుల బారినపడుతుంటే..అది కచ్చితంగా ఇమ్యూనిటీ లోపమే. అందుకే బ్రోకలీని డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి.

పాలకూర

పాలకూరలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది. అందుకే సీజన్ మారినప్పుడు పాలకూర తప్పకుండా తీసుకోవాలి

బాదం

డ్రై ఫ్రూట్స్ సేవించడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది. బాదంను డైట్‌లో భాగంగా చేసుకుంటే ఇమ్యూనిటీ బలోపేతమౌతుంది. 

Also read: Eye Sight: ఎలాంటి ఖర్చు లేకుండా ఓక్రా వాటర్‌తో కంటి చూపు సమస్యలకు చెక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News