Health Tips: ఆధునిక పోటీ ప్రపంచంలో రక్తపోటు, కొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండెపోటు, కిడ్నీ వ్యాధులు ప్రధాన సమస్యగా మారాయి. ఇందులో అన్నింటికంటే ప్రమాదకరం కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ కారణంగానే ఇతర వ్యాధులు ఉత్పన్నమౌతాయని వైద్యులు చెబుతున్నారు.
అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, శరీరానికి ఇది అవసరమా లేదా, ఎలా ఏర్పడుతుంది. కొలెస్ట్రాల్ ఉంటే ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయనేది తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ అనేది మైనం వంటి పదార్ధం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ దీనినే హెచ్‌డీఎల్‌గా పిలుస్తారు. రెండవది చెడు కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్ అంటారు. కొలెస్ట్రాల్ అనేది శరీరంలో వివిధ రకాల హార్మోన్లు, సెల్ గోడలను ఏర్పరుస్తుంది. కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమే. ఎందుకంటే దీనిద్వారానే శరీరానికి అవసరమైన టెస్టోస్టిరోన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లు తయారౌతాయి. అయితే ఎల్‌డీఎల్ అనేది శరీరానికి ప్రమాదకరం. ఏ మాత్రం మంచిది కాదు. ఎల్‌డీఎల్ శరీరంలో పెరగకుండా చూసుకోవాలి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డీఎల్ పెరిగినప్పుడు ఆ ప్రభావం ముందుగా చేతులు, కాళ్లపై కన్పిస్తుంది. చేతులు , కాళ్లకు రక్త సరఫరా తగ్గడం వల్ల సిరలు రంగు మారడం, ఉబ్బడం, తిమ్మిరి వంటివి కన్పిస్తాయి. చేతులు, కాళ్ల వద్ద వాపు కన్పిస్తుంది. అంతేకాకుండా..బలహీనత కూడా ఉంటుంది.
మరో ప్రధాన లక్షణం చర్మంపై దద్దుర్లు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్త నాళాల్లో పేరుకున్న పదార్ధాలు గడ్డకడతాయి. ఫలితంగా చర్మంపై దద్దుర్లు, దురద ఉంటుంది. కళ్ల కింద, వెనుక, కాళ్లపై , అరచేతులపై కూడా కణితులుగా కన్పించవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా కాకపోవడం వల్ల గోళ్లు పాడవుతాయి. గోర్లపై నల్లని గీతలు ఏర్పడటం లేదా రంగు మారడం ప్రధానంగా కన్పిస్తుంది.
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే కళ్ల చుట్టూ పసుపు మచ్చలు ప్రధానంగా కన్పిస్తాయి. కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ ఈ మచ్చలు ముక్కు వరకూ చేరుతాయి. అందుకే కొలెస్ట్రాల్‌ను ప్రారంభంలో తగ్గించేందుకు ప్రయత్నించాలి. కొలెస్ట్రాల్ నియంత్రణ అంతా కేవలం ఆహారపు అలవాట్లు, వ్యాయామంపైనే ఆధారపడి ఉంటుంది. సిగరెట్లు, ఆల్కహాల్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్, మసాలా పదార్ధాలు, పిజ్జా బర్గర్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. కూరగాయలు, పప్పులు, గుడ్లు క్రమం తప్పకుండా తినడమే కాకుండా నిర్ణీత పద్ధతిలో వ్యాయామం లేదా వాకింగ్ చేస్తే కచ్చితంగా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
Also read: మహిళలు ఈ లక్షణాలను గమనించారా..? అయితే మీరు గుండెపోటుకు గురవ్వనున్నారని అర్థం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook