Uric Acid Problems: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, డయాబెటిస్, యూరిక్ యాసిడ్ వంటివి ఇందులో కొన్ని. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం ఇందులో ఒక వ్యాధి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి..ఆ వివరాలు మీ కోసం..
శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమౌతాయి. ముఖ్యంగా వేళ్లు, మడమలు, ఎముకలు, జాయింట్స్‌లో తీవ్రమైన నొప్పి ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ అసాధారణంగా పెరిగితే ఆ స్థితిని హైపర్ యురిసీమియా అంటారు. అసలు శరీరంలో యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది, కారణాలేంటనేది తెలుసుకోవడం చాలా అవసరం. సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ దుష్పరిణామాల్ని నివారించవచ్చు. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి ఒక కారణమంటూ ఉండదు. చాలా కారణాలుంటాయి.
మద్యం సేవించడం శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రధాన కారణం. మత్తు పదార్ధాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే వీటివల్ల వ్యక్తికి డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. పరిస్థితి విషమిస్తే యూరిక్ యాసిడ్ ఫిల్టరేషన్ ప్రక్రియలో ఆటంకం ఏర్పడుతుంది.
మెటబోలిక్ సిండ్రోమ్ మరో కారణంగా చెప్పవచ్చు. ఈ సమస్య సాధారణంగా అధిక బరువుతో ముడిపడి ఉంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ అన్ని సమస్యలుంటాయి. ఫలితంగా యూరిక్ యాసిడ్ కూడా పెరుగుతుంది. కిడ్నీల పనితీరు సరిగ్గా లేకపోయినా యూరిక్ యాసిడ్ సమస్య రావచ్చు. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. కిడ్నీ రోగాలు, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు కారణం కావచ్చు.
ఆహార పదార్ధాలు అతి ముఖ్యమైన భూమిక వహిస్తాయి. తినే ఆహారంలో మాంసం ఎక్కువైతే యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలున్నాయి. ఆర్గాన్ మాంసం, సముద్ర చేపలు ఎక్కువగా తింటే యూరిక్ యాసిడ్ పెరగవచ్చు. దీంతోపాటు ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే కార్న్ సిరప్ లేదా మధ్యం తీసుకున్నా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. స్థూలకాయం కూడా యూరిక్ యాసిడ్ పెరగడానికి ముఖ్య కారణం. అధిక బరువు అనేది సాధారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచుతుంది. ఫలితంగా కిడ్నీలో యూరిక్ యాసిడ్ సరైన రీతిలో ఫిల్టర్ కాదు. కొన్ని రకాల మందులు కూడా యూరిక్ యాసిడ్‌ను పెంచుతాయి. అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇష్టారాజ్యంగా మందులు వాడకూడదు. వైద్యుని సలహా మేరకే తీసుకోవాలి.
ఇదంతా ఓ ఎత్తైతే జెనెటిక్ కారణాలు అంటే కొంతమందిలో వంశపారంపర్యంగా ఇంట్లో పెద్దలకుంటే ఆ కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు. కుటుంబంలోని తరాల్లో కొన్ని ఎంజైమ్స్ లోపాన్ని గుర్తించారు. ఫలితంగా ఆ వ్యక్తుల కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను సరిగ్గా ఫిల్టర్ చేయవు. దాంతో యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు తగిన పరీక్షలు చేయించుకుని సకాలంలో చికిత్స చేయించుకుంటే సులభంగా నియంత్రించవచ్చు.
Also read: Anti Ageing Serum: ఈ సీరమ్ రోజూ రాస్తే చాలు 3 వారాల్లో ముడతలు, పింపుల్స్ దూరం, నిత్య యౌవనం మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook