High Cholesterol Signs: చెడు కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే శరీరంలో ఎదురయ్యే చాలా వ్యాధులకు ఇదే మూల కారణం. ముఖ్యంగా హార్ట్ ఎటాక్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, మధుమేహం, రక్తపోటు వంటివి కొలెస్ట్రాల్ కారణంగానే ప్రారంభమౌతాయి. ఈ వ్యాధులు తీవ్రమైతే ప్రాణాలు కూడా పోతాయి.
కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ సహాయంతో శరీరంలో ఆరోగ్యకరమైన కణజాలం నిర్మితమౌతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందుకే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు చెడు కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటుండాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే కొన్ని భాగాల్లో నొప్పి తలెత్తుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడవచ్చు. ఫలితంగా రక్తం గుండె వరకూ చేర్చడంలో ఒత్తిడి పెరుగుతుంది. దాంతో రక్తపోటు పెరిగి గుండె నొప్పికి దారితీయవచ్చు. అందుకే ఈ పరిస్థితి తలెత్తకుండానే కొలెస్ట్రాల్ నియంత్రించాల్సి ఉంటుంది.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు తొడలు, హిప్స్, కాఫ్ మజిల్స్‌లో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ధమనుల్లో బ్లాకేజ్ కారణంగా రక్తం గుండెకే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలకు చేరడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రత్యేకించి కాళ్లలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దాంతో ఈ అంగాలకు ఆక్సిజన్ సరఫరాలో కాకపోవడంతో నొప్పి ఏర్పడుతుంది. దీనినే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు.
తొడలు, హిప్స్, కాఫ్ మజిల్స్‌లో తీవ్రమైన నొప్పి కారణంగా దైనందిక కార్యక్రమాలు కూడా చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ చెకప్ చేస్తుండాలి. కాళ్లు, పాదాల్లో తీవ్రమైన నొప్పి ఉంటుంది. కాళ్లలో తిమ్మిరి ఉండవచ్చు. కాళ్లు చల్లబడినట్టుంటాయి. కాళ్ల గోర్ల రంగు మారుతుంది. పసుపుమయం కావచ్చు. కాలి వేళ్లలో స్వెల్లింగ్ ఉంటుంది. కాళ్లు వీక్‌గా ఉంటాయి. కాలి చర్మం రంగు మారుతుంది.
Also read: Fatty Liver Problem: ఫ్యాటీ లివర్‌కు ఈ 5 పదార్ధాలు విషంతో సమానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook