Stomach Cancer Symptoms: ఆదునిక జీవన విధానంలో మసాలా ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ సేవనం ఎక్కువైపోయింది. ఆరోగ్యపరంగా ఇది చాలా ప్రమాదకరం. అదే సమయంలో ఛాతీలో మంట, పుల్లటి తేన్పులు వస్తుంటే ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దంటున్నారు వైద్య నిపుణులు. ప్రమాదకరమైన కడుపు కేన్సర్ కావచ్చంటున్నారు..
మనిషి శరీరానికి మసాలా భోజనం ఎంత హానికరమో..ఆకలితో ఉండటం కూడా అంతే హానికరం. కడుపు ఖాళీగా ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే అలా ఉంటే పుల్లటి తేన్పులు, ఛాతీలో మంట సమస్యలు ఉత్పన్నమౌతాయి. చెడు ఆహారపు అలవాట్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కడుపులో ఏర్పడే ఎసిడిటీని చాలామంది తేలిగ్గా తీసుకుని నిర్లక్ష్యం వహిస్తుంటారు. కానీ ఎసిడిటీ కారణంగా ఛాతీలో మంట, పుల్లటి తేన్పులు రావడం వంటి సమస్య తలెత్తితే కడుపులోని కేన్సర్ సెల్స్ వృద్ది చెందుతాయి. ఫలితంగా కడుపు పైభాగంలో లేదా లోపలి భాగంలో కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాది ప్రారంభం కావచ్చు. కడుపు కేన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..సకాలంలో చికిత్స లేకపోతే ప్రాణాంతకమౌతుంది.
కడుపు కేన్సర్ అంటే
ఎవరైనా వ్యక్తికి తరచూ ఎసిడిటీ సమస్య ఉంటుంటే కడుపులోపల హెచ్ పైలరీ అనే ప్రమాదకర ఇన్‌ఫెక్షన్ మొదలైందని అర్ధం చేసుకోవాలి. ఈ ఇన్‌ఫెక్షన్ మీ డీఎన్ఏను నెమ్మది నెమ్మదిగా దెబ్బతీస్తుంటుంది. క్రమంగా ఇది కడుపు కేన్సర్ ముప్పుగా పరిణమిస్తుంది. అదే పనిగా ఎసిడిటీ సమస్య ఉంటే కడుపులో ఉండే మంచి యాసిడ్ కూడా పోతుంది. దీర్ఘకాలంపాటు ఎవరైనా వ్యక్తికి ఎసిడిటీ సమస్య ఉంటే కడుపులో మ్యూకస్, డీఎన్ఏ రిపేర్ జరగదు. ఫలితంగా కేన్సర్ ముప్పు పెరిగిపోతుంది.
కడుపు కేన్సర్ లక్షణాలు
వ్యక్తి ఛాతీలో తరచూ మంట రావడం, ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు లేదా సాధారణ పరిస్థితుల్లో సైతం పుల్లటి తేన్పులు రావడం, నోటి నుంచి దుర్వాసన, పళ్లలో పురుగులు పట్టడం, కడుపులో తరచూ నొప్పి రావడం, జీర్ణక్రియ వికటించడం కడుపు కేన్సర్ ప్రధాన లక్షణాలుగా భావించవచ్చు.
మద్యానికి, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలి. రోజూ వ్యాయామం లేదా యోగా తప్పనిసరిగా చేయాలి. ఎక్కువ మసాలా ఉండే పదార్ధాలు, ఆయిలీ ఫుడ్స్ రోజూ తినడం మానుకోవాలి. పెరుగుతున్న బరువును నియంత్రించుకోవాలి. భోజనం చేసిన తరువాత పడుకునే ముందు కనీసం 2 గంటల అంతరం ఉండేట్టు చూసుకోవాలి. భోజనం చేసిన వెంటనే పడుకోవడం లేదా కూర్చోవడం మంచిది కాదు.
Also read: Belly Fat Loss: బ్లాక్ కాఫీతో అధిక బరువుకు 15 రోజుల్లో చెక్ పెట్టొచ్చు! ప్రతి రోజు ఇలా తాగండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook