Jelly Belly Cancer: ఈ సాధారణ లక్షణాలు జెల్లీ బెల్లీ కేన్సర్ కావచ్చేమో, తస్మాత్ జాగ్రత్త

Jelly Belly Cancer: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ మహమ్మారికి ఇప్పటికీ సరైన చికిత్స లేదు. అంతటి ప్రమాదకరమైంది కాబట్టే కేన్సర్ మాట వింటే చాలు భయం పుడుతుంది. ఈ క్రమలో ఏది కేన్సర్ ఏది కాదు అనేది తెలుసుకోవడమే అతి పెద్ద సమస్యగా మారుతుంటుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 22, 2023, 07:32 PM IST
Jelly Belly Cancer: ఈ సాధారణ లక్షణాలు జెల్లీ బెల్లీ కేన్సర్ కావచ్చేమో, తస్మాత్ జాగ్రత్త

Jelly Belly Cancer: ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో రెండవ అతి పెద్ద కారణం కేన్సర్ అనేది ఆందోళన కల్గిస్తోంది. కేన్సర్ చాలా రకాలుగా ఉంటుంది ఇందులో ఒకటి జెల్లీ బెల్లీ కేన్సర్. అసలీ జెల్లీ బెల్లీ కేన్సర్ అంటే ఏమిటి , లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..

జెల్లీ బెల్లీ కేన్సర్ గురించి బహుశా మీరు వినుండరు ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది ఒక ట్యూమర్ లాంటిది. క్రమంగా క్రమంగా పెరుగుతుంది. కడుపు, పెల్విక్స్‌లో జెల్లీ వంటి పదార్ధం మ్యూసిన్ ఉత్పత్తికి కారణమౌతుంది. స్యూడోమైక్సోమా పెరిటోనీ అనేది కఠినమైన ట్యూమర్. సాధారణంగా అపెండిక్స్‌లో కూడా ప్రారంభమౌతుంది. కానీ పెద్ద ప్రేవులు, అండాశయం వంటి ఇతర శరీర భాగాల్లో కూడా ఉంటుంది.

జెల్లీ బెల్లీ కేన్సర్ పూర్తి పేరు జైలియన్ బేలీ కేన్సర్.  జెల్లీ బెల్లీ నాసికాభాగంలో ఉంటుంది. వాస్తవంలో జెల్లీ బెల్లీ కేన్సర్ లైనింగ్‌పై ఓ గాయంలా మొదలవుతుంది. బ్లాడర్, ఓవరీ, పెద్ద ప్రేవుల్లో కూడా మొదలు కావచ్చు. ముందుగా శరీరంలో చిన్నగా పోలిప్ ఏర్పడుతుంది.  ఆ తరువాత అపెండిక్స్ గోడలకు వ్యాపిస్తుంది. చివరిగా అబ్డోమిన్ కేవిటీ వాల్‌లో కేన్సర్ కణాల్ని ఏర్పరుస్తుంది. దీనినే పెరిటోనియమ్ పేరుతో పిలుస్తారు.  జెల్లీ బెల్లీ కేన్సర్ ముఖ్య కారణం మిటోటిక్ రేట్ అనే ప్రక్రియలో పొరపాట్ల వల్ల సంభవిస్తుంది. దీంతో టిష్యూస్‌లో అపరిమితమైన ఎదుగుదల ఉంటుంది.

జెల్లీ బెల్లీ కేన్సర్ లక్షణాలు

కడుపులో నొప్పి లేదా ఒత్తిడి, కడుపులో స్వెల్లింగ్, వాంతులు, వాంతుల్లో రక్తం కారడం, మలంలో రక్తం రావడం, బరువు తగ్గడం, కడుపు బరువుగా ఉండటం

మీలో కూడా జెల్లీ బెల్లీ కేన్సర్ లక్షణాలు కన్పిస్తే తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. నిర్దారణ కోసం వివిధ రకాల పరీక్షలు ఉంటాయి. సిటి స్కాన్, ఎంఆర్ఐ, బయాప్సీ పరీక్షలు అవసరం. జెల్లీ బెల్లీ కేన్సర్ చికిత్స సాధారణంగా సర్జరీ, రేడియేషన్, టార్గెటెడ్ థెరపీతో చేస్తారు. హెల్తీ ఫుడ్, తగిన నీళ్లు తాగడం, రోజూ నిర్ణీత సమయంలో వ్యాయామం ద్వారా కేన్సర్ రోగాలకు చెక్ పెట్టవచ్చు.

Also read: Male Infertility: స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ సమస్యగా మారిందా, ఈ 5 సూపర్‌ఫుడ్స్ తింటే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News