Diabetes Precautions: మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఈ 5 పదార్ధాలు విషంతో సమానం

Diabetes Precautions: ఆధునిక జీవన విధానంలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి డయాబెటిస్. ఇప్పటికే సరైన చికిత్స లేకపోవడంతో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదకరంగా మారుతుంటుంది. అందుకే మధుమేహం అంటే భయపడే పరిస్థితి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 9, 2023, 02:18 PM IST
Diabetes Precautions: మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఈ 5 పదార్ధాలు విషంతో సమానం

Diabetes Precautions: ఆధునిక బిజీ ప్రపంచంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇందులో డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్, కిడ్నీ వ్యాధులు కీలకం. అందుకే వీటిని లైఫ్‌స్టైల్ వ్యాధులుగా పిలుస్తుంటారు. వీటిలో ప్రమాదకరమైంది డయాబెటిస్.

మన దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి. శరీరంలో ఇన్సులిన్ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. దీనినే బ్లడ్ షుగర్ అంటారు. బ్లడ్ షుగర్ మోతాదు దాటితే మధుమేహం ఉన్నట్టుగా నిర్ధారిస్తారు. మధుమేహం అనేది పూర్తిగా ఆహారపు అలవాట్లను బట్టే ఉంటుంది. అందుకే ఆహారపు అలవాట్లను నియంత్రించడం ద్వారా డయాబెటిస్ కంట్రోల్ చేయవచ్చు. అందుకే డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కొన్ని రకాల పదార్ధాలను అస్సలు తీసుకోకూడదు. ఓ విధంగా చెప్పాలంటే ఈ పదార్ధాలు డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు విషం లాంటిదే.

ఫ్రై చేసినవి, మసాలా పదార్ధాలను మధుమేహ వ్యాధిగ్రస్థులు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా చికెన్ ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి తినకూడదు. తృణధాన్యాలు మంచి డైట్ అని చెప్పవచ్చు. 

తీయటి పానీయాలు, డ్రింక్స్, శీతల పానీయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సేవించకూడదు. మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఇది చాలా ప్రమాదకరం. సోడా లాంటివి కూడా ముట్టకూడదు. 

ప్యూరిఫైడ్ మిల్క్ కూడా డయాబెటిక్ రోగులకు మంచిది కానే కాదు. ఇందులో కేలరీలతో పాటు షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర శాతాన్ని విపరీతంగా పెంచుతాయి. పాలు తాగడం కంటే మజ్జిగ తాగడం చాలా మంచిది. 

ప్యాకెట్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ అస్సలు తినకూడదు. మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఈ పదార్ధాలు అస్సలు మంచివి కావు. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కు పూర్తిగా దూరంగా ఉండాలి. 

మధుమేహం వ్యాధిగ్రస్థులు కాఫీ హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కాఫీని రోజూ కాకుండా అప్పడుప్పుడా తాగవచ్చు. అది కూడా షుగర్ లేకుండా. ఎందుకంటే షుగర్, కెఫీన్ కాంబినేషన్ ఏ మాత్రం మంచిది కాదు. 

Also read: Skin Care: ఐస్ వాటర్ తో ఫేషియల్.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News