Diabetes Control Tips: బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు చేసే ఆరు అద్భుతమైన పద్ధతులు

Diabetes Control Tips: డయాబెటిస్ అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి ఇది. అంతేకాదు..ఇతర వ్యాధులకు కూడా కారణమౌతోంది. అందుకే మధుమేహం వ్యాధిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 19, 2024, 04:28 PM IST
Diabetes Control Tips: బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు చేసే ఆరు అద్భుతమైన పద్ధతులు

Diabetes Control Tips: మనిషి ఎదుర్కొనే వివిధ రకాల వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైంది మధుమేహం. ఒక్క మధుమేహం కారణంగా అధిక రక్తపోటు సమస్య తలెత్తవచ్చు. ఇది కాస్తా హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్‌లకు దారీ తీయవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు అనేవి ఒకదానికొకటి సంబంధమున్నవని..ఇతర ప్రాణాంతక వ్యాధులకు దారీ తీస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 

మరి ఈ పరిస్థితుల్లో మధుమేహం ఎలా నియంత్రించుకోవాలనేది ప్రధాన సమస్య. కేవలం మందుల ద్వారానే మధుమేహం నియంత్రణ సాద్యమౌతుందా అనేది ప్రధానమైన ఆందోళన. అయితే ప్రకృతిలో లభించే సహజసిద్దమైన సీడ్స్ సైతం బ్లడ్ షుగర్ నియంత్రించేందుకు అద్బుతంగా పనిచేస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ సీడ్స్ తీసుకోవడం ద్వారా మధుమేహం నియంత్రణకు మందులు వాడాల్సిన అవసరం లేదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు దోహదపడే సహజసిద్ధమైన సీడ్స్‌లో ముఖ్యమైనవి నువ్వులు, చియా సీడ్స్, మెంతులు, గుమ్మడికాయ విత్తనాలు, సన్‌ఫ్లవర్ సీడ్స్,

నువ్వులు

నువ్వుల్లో ప్రోటీన్స్‌తో పాటు హెల్తీ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఫలితంగా బ్లడ్ షుగర్ నియంత్రణకు ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పైనోరెసినోల్ కారణంగా బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. షుగర మాల్టోజ్ బ్రేక్ చేయడంలో మాల్టేజ్ పాత్ర కీలకం. మాల్టోజ్ జీర్ణ ప్రక్రియలో పైనోరెసినాల్ ఇన్‌హిబిట్ అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

చియా సీడ్స్

చియా సీడ్స్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కడుపులో జెల్ ఫామ్ చేయడం ద్వారా రక్తంలో చక్కెర సంగ్రహణను స్లో చేస్తుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందులో కూడా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. ఫలితంగా బ్లడ్ షుగర్ స్థాయి ఆదుపులో ఉంటుంది. 

మెంతులు

మెంతుల్లో సాల్యుబుల్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ స్థాయి తగ్గుతుంది. కార్బోహైడ్రేట్ల సంగ్రహణ మందగిస్తుంది. అంతేకాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం, ఇన్సులిన్ ఉత్పత్తిని స్టిమ్యులేట్ చేయడం చేస్తుంది. మెంతుల్ని ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. దేశంలో చాలా రకాల వ్యాధులకు మెంతుల్ని చిట్కా రూపంలో ఉపయోగిస్తారు. 

గుమ్మడికాయ విత్తనాలు

గుమ్మడికాయ విత్తనాల్లో లభించే మెగ్నీషియం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెర సంగ్రహణను మందగించేలా చేస్తాయి. 

సన్‌ఫ్లవర్ విత్తనాలు

సన్‌ఫ్లవర్ విత్తనాల్లో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా తగ్గుతాయి. రక్తంలో చక్కెర సంగ్రహణను నెమ్మదిగా జరిగేలా చేస్తాయి. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కారణంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. 

Also read: Farmer Loan Waiver: రుణ మాఫీ, పెన్షన్ పెంపుతో జగన్ ఎన్నికల గేమ్ చేంజ్ చేయనున్నారా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News