Green tea vs Black Coffee: గ్రీన్ టీ, బ్లాక్ కాఫీలు కచ్చితంగా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. అయితే ఈ రెండింట్లో ఏది మంచిదనేది తెలుసుకోవడం ఇంకా అవసరం. ఇది తెలుసుకోవాలంటే ముందుగా గ్రీన్ టీ, బ్లాక్ కాఫీలతో కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం.
బ్లాక్ కాఫీ ప్రయోజనాలు
బ్లాక్ కాఫీ కూడా కాఫీ గింజలతోనే తయారౌతుంది. కానీ రెగ్యులర్ కాఫీకు కాస్త భిన్నమైంది. ఇందులో ఉండే అతి ముఖ్యమైన పదార్ధం కెఫీన్. కెఫీన్ అనేది మైండ్‌ను రిఫ్రెష్ చేసేందుకు, అలసట తగ్గించేందుకు దోహదం చేస్తుంది. క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల నాడీ సంబంధిత వ్యాధులు, లివర్ రోగాల ముప్పు తగ్గుతుంది. బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరంలో మెటబోలిజం మెరుగుపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆకలి ఆదుపులో ఉండటం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అయితే పంచదార లేకుండా లేదా తక్కువ పంచదారతో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
గ్రీన్ టీ ప్రయోజనాలు
గ్రీన్ టీ అనేది ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలో వచ్చింది. ఇది కామెల్లియా సైనెస్సిస్ మొక్క ఆకుల్నించి తయారౌతుంది. ఇందులో క్యాటెచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనివల్ల శరీరంలో గ్లూకోజ్ మెటబోలిక్ ప్రాసెస్‌కు దోహదం చేస్తుంది. గ్రీన్ టీ క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గ్రీన్ టీలో కూడా కెఫీన్ ఉంటుంది. కానీ తక్కువ పరిణామంలో ఉంటుంది. కెఫీన్, ఎల్ థియానిన్ కాంబినేషన్ కారణంగా మెదడు పనితీరు బాగుంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.
గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ టీ ప్రయోజనాల్ని పరిశీలించినప్పుడు దాదాపుగా ఒకటే సామీప్యత కన్పించినా గ్లూకోజ్ మెటబోలిక్ ప్రక్రియలో గ్రీన్ టీ ఎక్కువ సమర్ధవంతంగా పనిచేస్తుందని తేలింది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా గ్రీన్ టీలోనే అధికం. మరోవైపు అధిక మోతాదులో కెఫీన్ శరీరానికి మంచిది కాదు కాబట్టి గ్రీన్ టీ బెస్ట్ అని చెప్పవచ్చు.
Also read: Washing Hair During Periods: పీరియడ్స్ సమయంలో తల స్నానం ఎందుకు చేయకూడదు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook