Cumin Seeds Benefits: ఈ నీళ్లు రోజూ పరగడుపున తాగితే చాలు..స్థూలకాయం సహా చాలా సమస్యలు దూరం

Cumin Seeds Benefits: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం పెను సమస్యగా మారింది. బరువు తగ్గించేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. ఈ క్రమంలో కొన్ని వంటింటి చిట్కాలు అద్భుతంగా ఉపయోగపడతాయంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 10, 2023, 04:26 PM IST
Cumin Seeds Benefits: ఈ నీళ్లు రోజూ పరగడుపున తాగితే చాలు..స్థూలకాయం సహా చాలా సమస్యలు దూరం

Cumin Seeds Benefits: స్థూలకాయం అనేది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఒక్క స్థూలకాయం కారణంగా గుండెపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వ్యాధులే కాకుండా ఆఖరికి కిడ్నీ సమస్యలు కూడా తలెత్తవచ్చు. అందుకే సకాలంలో లేదా తగిన సమయంలో స్థూలకాయం సమస్య నుంచి విముక్తి పొందాలి. 

వాస్తవానికి శరీరంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం ప్రకృతిలో లభించే పదార్ధాల్లోనే ఉంటుంది. ముఖ్యంగా ప్రతి భారతీయుల కిచెన్‌లో తప్పకుండా లభించే కొన్ని రకాల పదార్ధాలతో చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా అతి ప్రమాదకర వ్యాధిగా మారిన అధిక బరువు సమస్యకు సైతం చెక్ పెడుతుంది. ఇందులో అతి ముఖ్యమైంది జీలకర్ర. జీలకర్ర అద్భుతమైన ఆయుర్వేద లక్షణాలు కలిగి ఉంటుంది. ఇందులో ఉండే థైమోక్వినోన్ అనే మందు సహజసిద్ధమైన కెమికల్ తో అధికంగా ఉన్న బరువును తగ్గించవచ్చు. థైమోక్వినోన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బరువు తగ్గేందుకు దోహదపడటమే కాకుండా శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దాంతో శరీరంలో ఉండే విష పదార్ధాలు శరీరం నుంచి బయటకు తొలగిపోతాయి. ఇటీవలి కాలంలో చాలామంది ఈ సమస్యతోనే బాధపడుతున్నారు. 

జీలకర్ర నీళ్లు ఇందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. జీలకర్ర నీళ్ల తయారీ కూడా చాలా సులభం. ఓ గ్లాసు నీళ్లలో రెండు స్పూన్ల జీలకర్ర వేసి దాదాపు 10 నిమిషాలసేపు ఉడకబెట్టాలి. కాస్త చల్లారిన తరువాత  రోజూ పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

జీలకర్రలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల శరీరంలోని విష పదార్ధాలు చాలా సులభంగా తొలగిపోతాయి. జీలకర్ర నీళ్లు అనేవి అద్భుతమైన డీటాక్సిఫయర్ అని చెప్పవచ్చు. శరీరంలోని మొత్తం వ్యవస్థ శుభ్రమౌతుంది. మనిషి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ఇక జీలకర్ర నీళ్లతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాల కారణంగా జీర్ణక్రియ సులభమౌతుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. విరేచనాలు, మార్నింగ్ సిక్నెస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల్నించి కాపాడుతుంది.

జీలకర్ర నీళ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దాంతో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమౌతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి కారణంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. చాలా రకాల వ్యాధుల్ని నియంత్రించడంలో ఉపయక్తమౌతుంది. జీలకర్ర నీళ్లు తాగడం వల్ల శరీరం అధిక బరువు నుంచి నియంత్రణ పొందవచ్చు. దాంతోపాటు కడుపు, నడుము చుట్టూ పేరుకునే కొవ్వును కరిగించవచ్చు. దాంతో శరీరం ఫిట్‌గా ఉంటుంది. 

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో జీలకర్ర నీళ్లతో శరీరంలోని విష పదార్ధాలను అత్యంత సమర్ధవంతంగా బయటకు తొలగించవచ్చు. ఫలితంగా అంతర్గతంగా ఉండే అంగాలు ఆరోగ్యంగా మారతాయి. జీలకర్రను రాత్రి వేళ నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ నీళ్లను తాగితే మంచి ఫలితాలు కలుగుతాయి.

Also read: Weight Loss Tips: ప్రతిరోజు గ్లాసు ఈ రసాన్ని తాగితే..శరీర బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలకు 15 రోజుల్లో చెక్ పెట్టొచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News