Coconut Water: మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఏది తినవచ్చు ఏది తినకూడదనే విషయంలో ఎప్పటికప్పుడు చాలా సందేహాలుంటాయి. కారణం ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పడమే. ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన పండ్లు అన్నీ తినవచ్చని కొందరంటే..ఇంకొందరు కొన్ని పండ్లకు దూరంగా ఉండాలంటారు. అదే విధంగా కొబ్బరినీళ్ల విషయంలో కూడా సందేహాలు చాలా కాలంగా ఉన్నాయి. వాస్తవం ఏంటో తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. మనిషి శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే సరిపోతుందంటారు. అయితే కొబ్బరిలో ఉండే స్వీట్నెస్ కారణంగా మధుమేహం వ్యాధిగ్రస్థులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా లేదా అనే సందేహాలు పీడిస్తుంటాయి. కొంతమందైతే మధుమేహం వ్యాధిగ్రస్థులకు కొబ్బరి నీళ్లు ప్రమాదకరమని తేల్చేస్తుంటారు. కానీ వాస్తవానికి కొబ్బరి నీళ్లు మధుమేహం వ్యాధిగ్రస్థులకు సైతం చాలా మంచివి. రక్తంలో చక్కెర శాతం తగ్గించే గుణాలు ఇందులో ఉంటాయి. మధుమేహం వ్యాధిగ్రస్థులకు కొబ్బరి నీళ్లు ఏ విధంగా ప్రయోజనం కల్గిస్తాయో పరిశీలిద్దాం..
కొబ్బరి నీళ్లు తీపిగా ఉన్నా ఇది ప్రకృతి సహజసిద్ధమైంది. అంటే నేచురల్ షుగర్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషయం, మాంగనీస్, విటమిన్ సి, ఎల్ అర్జినైన్ కారణంగా బ్లడ్ షుగర్ ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పోషకాలు ఇన్సులిన్ రెస్టిస్టెన్స్ పెంచడంలో దోహదపడటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా కొబ్బరి నీళ్లు శరీరంలో ప్రమాదకరమైన ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాయి. ఫలితంగా గుండె వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది. కొబ్బరి నీళ్లు రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో ట్రై గ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్, లివర్ ఫ్యాట్ సమస్యలు తగ్గుతాయి. కొబ్బరి నీళ్లు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా 54 మాత్రమే. ఇది మధ్యస్తంలో వస్తుంది కాబట్టి మధుమేహం వ్యాధిగ్రస్థులకు ప్రమాదకరం కాదంటున్నారు వైద్యులు.
కొబ్బరి నీళ్లలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ప్రీ రాడికల్స్ నిర్మూలమై కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ కొబ్బరి నీళ్లు సేవించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్థుల్లో ఎదరయ్యే దృష్టి, కండరాల నొప్పులు దూరమౌతాయి. కొబ్బరి నీళ్లలో ఉండే అన్ని రకాల మినరల్స్ , విటమిన్ల వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ గణనీయంగా పెరుగుతాయి. శరీరంలో గ్లూకోజ్ వినియోగం నియంత్రణలో ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
కొబ్బరినీళ్లలో ఉండే బయో యాక్టివ్ పదార్ధాల కారణంగా జీర్ణక్రియ, జీవక్రియ రెండూ వేగవంతమౌతాయి. శరీరంలో పేరుకున్న కొవ్వు వేగంగా కరుగుతుంది. గ్లూకోజ్ స్థాయి స్థిరీకరణ చెందుతుంది. కొబ్బరి నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, చియా సీడ్స్ కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి మరింత ప్రయోజనం కలుగుతుంది. అద్భుతమైన ఎనర్జీ డ్రింక్‌గా కూడా ఉపయోగపడుతుంది.
Also read: Tamarind Leaves: చింతచిగురు ఔషధ విలువలు.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం…
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook