Heart Attack Signs: హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరంలోని ఏయే భాగాల్లో నొప్పి ఉంటుంది

Heart Attack Signs: శరీరంలో అత్యంత ముఖ్యమైన అంగం గుండె. గుండె ఆగిందంటే ప్రాణం పోయినట్టే. అందుకే గుండెను అత్యంత జాగ్రత్తగా చూసుకోవల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతక పరిస్థితులు ఎదురౌతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 21, 2024, 06:50 PM IST
Heart Attack Signs: హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరంలోని ఏయే భాగాల్లో నొప్పి ఉంటుంది

Heart Attack Signs: ఇటీవలి కాలంలో గుండె నొప్పి సమస్యలు అధికంగా ఉంటున్నాయి. సాధారణంగా గుండె నొప్పి అనేది ఎప్పుడూ ఒకేసారి రాదంటున్నారు వైద్యులు. అంతకంటే ముందు వివిధ రూపాల్లో లక్షణాలు బయటపడతాయంటారు. అవి సకాలంలో గుర్తించగలిగితే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. 

హార్ట్ ఎటాక్ అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా విన్పిస్తున్న మాట. చాలా ఆందోళన కల్గించే అంశం. కానీ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరంలో చాలా సంకేతాలు కన్పిస్తాయి. ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధికం గుండెపోటు కారణంగానే అనేది నమ్మలేని నిజం. చాలామంది గుండెపోటును ఆకస్మాత్తుగా సంభవించేదిగా భావిస్తారు కానీ ఇది వాస్తవం కాదు. గుండెపోటు అనేది దీర్ఘమైన ప్రక్రియ. శరీరంలో చాలా లక్షణాలు కన్పిస్తాయి. సాధారణంగా మనం ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ సకాలంలో ఈ లక్షణాలను గుర్తించగలిగితే ప్రాణాంతక గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చు. 

హార్ట్ ఎటాక్ సంబంధిత లక్షణాలను నిర్లక్ష్యం చేయడమంటే భారీ మూల్యం చెల్లించుకోవడమే. ముఖ్యంగా శరీరం ఎగువభాగంలో వచ్చే నొప్పి కీలకమైంది. ఈ నొప్పి సరీరంలోని ఏయే భాగాల్లో సంభవిస్తుందనేది తెలుసుకుందాం.

హార్ట్ ఎటాక్ లక్షణాల్లో ప్రధానమైంది వీపు నొప్పి. దీర్ఘకాలంగా వీపు నొప్పి వస్తుండవచ్చు. చాలామంది కూర్చునే పోశ్చర్ లేదా పడుకునే పోశ్చర్ కారణంగా వస్తుందనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది గుండె పోటుకు సంకేతం కావచ్చు. 

హార్ట్ ఎటాక్ లక్షణాల్లో అతి సాధారణమైంది ఛాతీ నొప్పి. గుండె నొప్పి వచ్చేటప్పుడే కాకుండా ఇతర సందర్భాల్లో కూడా ఛాతీ నొప్పి వస్తుంటుంది. అంటే గుండె వ్యాధి సమస్య లేనప్పుడు కూడా ఎసిడిటీ, క్రాంప్స్ కారణంగా ఛాతీ నొప్పి రావచ్చు. అలాగని నిర్లక్ష్యం మంచిది కాదు. 

జబ్బుల్లో నొప్పి అనేది హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కన్పించే మరో ప్రధాన లక్షణం. గుండె నొప్పి వచ్చే ముందు జబ్బల్లో తీవ్రమైన భరించలేని నొప్పి ఉంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుుడు తక్షణం వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. 

హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరం ఎగువ భాగంలో కన్పించే వివిధ రకాల నొప్పుల్లో ముఖ్యమైంది భుజాల నొప్పి. భుజాల్లో అకారణంగా నొప్పి వస్తుంటే మాత్రం తేలిగ్గా తీసుకోవద్దు. ఇది కచ్చితంగా గుండెపోటుకు సంకేతం కావచ్చు. 

ఇక హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కన్పించే మరో నొప్పి మెడ నొప్పి. మెడ నొప్పి అనేది హార్ట్ ఎటాక్  ప్రారంభ లక్షణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. మీక్కూడా ఆకారణంగా మెడ నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా తక్షణం వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. 

Also read: Women Diet Tips: 40 ఏళ్లు దాటిన తరువాత మహిళలు తీసుకోవల్సిన డైట్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News