Health Tips: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పండ్లు కీలకంగా ఉపయోగపడతాయి. అందుకే ఏ వైద్యుడైనా సరే రోజూ పండ్లు తినమని సూచిస్తుంటారు. ఒక్కొక్క ఫ్రూట్‌లో ఒక్కో రకమైన పోషకాలు నిండి ఉంటాయి. పండ్లను చాలా సందర్బాల్లో కంప్లీట్ ఫుడ్ అని కూడా అభివర్ణిస్తారు. అయితే కొన్ని రకాల పండ్లను మాత్రం ఉదయం వేళ తినకూడదంటున్నారు వైద్యులు. ఆశ్యర్యంగా ఉందా...ఆ వివరాలు మీ కోసం..
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చాలా వరకూ ఉంటాయి. వీటికి తోడు సీజనల్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఇంకా ప్రయోజనకరం. అందుకే సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడూ మిస్ కాకూడదంటారు. పండ్లు ఆరోగ్యానికి మంచివి కదా అనే కారణంగా చాలామంది ఉదయం పరగడుపున ఫ్రూట్స్ తింటుంటారు. కానీ కొన్ని రకాల పండ్లు ఉదయం వేళ పరగడుపున అస్సలు తినకూడదు. ఏయే పండ్లు పరగడుపున తినకూడదు, తింటే ఏమౌతుందో తెలుసుకుందాం..
వాస్తవానికి యాపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అంటారు. ఆపిల్ అంత అద్భుతమైన పండు. కానీ ఇందులో ఉండే ఎసిడిక్ కంటెంట్ కారణంగా ఉదయం పరగడుపున తింటే కడుపు లైనింగ్‌పై ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా అజీర్తి సమస్య ఉత్పన్నమౌతుంది. పండ్లు అన్నింటిలో అద్భతమైందిగా భావించే బొప్పాయి కూడా పరగగడుపున తింటే కడుపు పాడవుతుంది. ఇక ఫైబర్ ఎక్కువగా ఉండే బెర్రీస్ ఆరోగ్యానికి మంచివి. కానీ పరగడుపున తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.
సిట్రస్ జాతి పండ్లుగా పిలిచే నారింజ,. బత్తాయి, నిమ్మ, ద్రాక్ష పండ్లను పరగడుపున తినడం వల్ల గుండెలో మంట, వికారం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. అరటి పండును సాధారణంగా సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ప్రోటీన్ల పరంగా అంత మంచిది. కానీ ఇందులో ఫైబర్ వల్ల పరగడుపున తింటే అజీర్తి సమస్య ఏర్పడుతుంది. ఫైబర్ అనేది కడుపులో ఉండే యాసిడ్‌తో కలిసి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణమౌతుంది. అరటి పండ్లను అతిగా కూడా తీసుకోకూడదు.
టొమాటోల్లో ఎసిడిక్ కంటెంట్ ఎక్కువ. అందుకే పరగడుపువ వీటిని తినకూడదు. స్టమక్ లైనింగ్ దెబ్బతింటుంది. గుండెలో మంట, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఏర్పడతాయి. కడుపులోని యాసిడ్ కాస్తా అన్నవాహికలో చేరితే ఛాతిలో మంట ఏర్పడుతుంది.
Also read: Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి, ఎలా నియంంత్రించవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Health Tips: అన్ని పండ్లు ఆరోగ్యానికి మంచివి కావా, ఈ పండ్లు పరగడుపున తింటే ఏమౌతుంది