Is Cashews increase Bad Cholesterol: జీడిపప్పు తింటే బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? ఏది నిజం..??

Cashews nuts & Bad Cholesterol: ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా కన్పించే సమస్య కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ నుంచి విముక్తి పొందేందుకు చాలా చిట్కాలు పాటిస్తుంటాం. అదే సమయంలో డైట్‌పై ఫోకస్ చాలా అవసరం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 26, 2022, 02:30 PM IST
Is Cashews increase Bad Cholesterol: జీడిపప్పు తింటే బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? ఏది నిజం..??

Facts about cashews nuts & Bad cholesterol: మెరుగైన ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ చాలా లాభదాయకం. ఇందులో ముఖ్యమైంది జీడిపప్పు. అందరూ చాలా ఇష్టంగా తినే డ్రై ఫ్రూట్స్‌‌లో ఇదొకటి. జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావన చాలామందిలో ఉంది. అయితే ఇది ఎంతవరకూ నిజమనేది పరిశీలిద్దాం..

వేసవికాలంలో చాలామంది జీడిపప్పు తినడం తగ్గించేస్తారు. కారణం ఇది వేడి చేస్తుందనే భావన. కానీ జీడిపప్పు తినడం వల్ల ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. అయితే జీడిపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయం చాలామందిలో ఉంది. అయితే ఇది మిద్య మాత్రమే. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే జీడిపప్పులో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాపర్, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, థయామిన్, విటమిన్ బి6, విటమిన్ కే, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు చాలా ఉంటాయి. అందుకే జీడిపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందనేది అవాస్తవం.

గుండెకు పదిలం

జీడిపప్పు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అరికాలి మంట తగ్గుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ లేనందున..ఆరోగ్యానికి చాలా మంచిది. అదే సమయంలో గుండె చాలా పదిలంగా ఉంటుంది.

జీడిపప్పు తినడం వల్ల కలిగే లాభాలు

డ్రై ఫ్రూట్స్ చర్మానికి చాలా మంచిది. చర్మంపై ముడతలు దూరమౌతాయి. జీడిపప్పు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నారులకు ఇది చాలా ప్రయోజనకరం. అధిక రక్తపోటు రోగులు రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. జీడిపప్పుతో అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు. శరీరానికి ఫుల్ ఎనర్జీ లభిస్తుంది. ఎముకలకు బలం చేకూరుతుంది. జీడిపప్పులో కాపర్, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పాటులో సహయపడతాయి.

Also read: Weight Loss Diet: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ చిన్న చిట్కాతో బెల్లీ ఫ్యాట్‌, అధిక బరువుకు చెక్‌ పెట్టొచ్చా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News