High Cholesterol: బాడీలో ఆ నొప్పులుంటే తేలిగ్గా తీసుకోవద్దు, హై కొలెస్ట్రాల్ సంకేతమే అది

High Cholesterol: శరీరంలో అంతర్గతంగా సమస్య వచ్చినప్పుడు వివిధ రూపాల్లో అది బయటపడుతుంటుంది. అదే విధంగా కొలెస్ట్రాల్ పెరిగితే..కొన్ని లక్షణాలు కన్పిస్తాయి. ఎలా గుర్తించాలి, కొలెస్ట్రాల్ ఎలా నియంత్రించాలనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 14, 2022, 08:52 PM IST
High Cholesterol: బాడీలో ఆ నొప్పులుంటే తేలిగ్గా తీసుకోవద్దు, హై కొలెస్ట్రాల్ సంకేతమే అది

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడమంటే..గుండె వ్యాధుల్ని ఆహ్వానించడమే. గుండె వ్యాధుల్నించి రక్షించుకోవాలంటే ముందుగా కొలెస్ట్రాల్ తగ్గించుకోకతప్పదు. శరీరంలో కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు కన్పించే లక్షణాలు గురించి పరిశీలిద్దాం..

శరీరంలో వివిధ అంగాల్లో ఒక్కోసారి తరచూ నొప్పి కలుగుతుంటుంది. కాళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటివి ఎదురైనప్పుడు సాధారణ నొప్పి అనుకుని తేలిగ్గా తీసుకుంటాం. కానీ ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌కు సంకేతాలు. సకాలంలో గుర్తించగలిగితే ఇతర పెను సమస్యల్నించి కాపాడుకోవచ్చు. హై కొలెస్ట్రాల్‌ను ఎలా గుర్తించాలి, ఎలా నియంత్రించాలనేది చూద్దాం..

కొలెస్ట్రాల్ గుర్తించడం ఇలా

కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు శరీరంలోని కొన్ని భాగాల్లో విపరీతమైన నొప్పి వస్తుంటుంది. ధమనుల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ వాటిని దెబ్బతీస్తుంటుంది. ఫలితంగా మజిల్స్ కుదించుకుపోవడం, తీవ్రమైన నొప్పి ఉంటాయి. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మోకాళ్లు, కాలి మడమల్లో నొప్పి తీవ్రంగా ఉంటుంది. కాళ్ల మజిల్స్ కుదించుకుపోవడం వల్ల నడవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇలాంటి కొలెస్ట్రాల్ లక్షణాలు కన్పిస్తే..కొన్ని చిట్కాలతో వాటిని నియంత్రించవచ్చు.

జీవనశైలిలో మార్పులు

కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు మీ జీవనశైలిలో మార్పు చేయడం తప్పనిసరి. మద్యం, స్మోకింగ్ అనేవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అందుకే వీటికి దూరంగా ఉండాలి.

ఏ డైట్ తీసుకోవాలి

సరైన డైట్ లేకపోతే కొలెస్ట్రాల్ నియంత్రణ చాలా కష్టం. చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉండే పదార్ధాలు తీసుకోవాలి. 

బరువు తగ్గించడం

స్థూలకాయంతో పాటు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంటుంది. ఒకవేళ మీరు కొలెస్ట్రాల్ తగ్గించాలనుకుంటే ముందు బరువు తగ్గించుకోవాలి. ముఖ్యంగా కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంతవరకూ కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

ఫిజికల్ యాక్టివిటీ

ఫిజికల్ యాక్టివిటీతో కొలెస్ట్రాల్ కచ్చితంగా తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. యోగా అనేది ఇంకా మంచిది. తేలికపాటి వర్కవుట్స్ ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.

Also read: Chest Pain: తరచూ ఛాతీ నొప్పి వస్తోందా, ఈ చిట్కాలు పాటిస్తే ఛెస్ట్ పెయిన్ నుంచి ఉపశమనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News