High Cholesterol Warning Sign: ప్రస్తుత రోజుల్లో అధిక కొలెస్ట్రాల్ పెద్ద సమస్యగా మారిపోయింది. చాలా మంది ఈ ప్రాబ్లమ్ ను ఎదుర్కొంటున్నారు. బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే (Cholesterol Increase In Body) గుండెపోటు, మధుమేహం, హైబీపీ మెుదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి మంచిది, రెండోది చెడ్డది. మంచి కొలెస్ట్రాల్ వల్ల మీ శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు ఏర్పడతాయి. అదే బ్యాడ్ కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
చెడు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?
సాధారణంగా వైద్యపరిభాషలో మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్డిఎల్ అంటారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతే గుండెపోటు, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. దీనికోసం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ యెుక్క లక్షణాలు సాధారణంగా కనిపించవు.
చెడు కొలెస్ట్రాల్ లక్షణాలు
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు.. మీ కాళ్లు, తొడలు, పాదాలు, భుజాలలో నొప్పి ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా తిమ్మిరి, చర్మం పసుపు రంగులోకి మారడం, కాళ్ల వాపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే మీ శరీర భాగాలకు రక్తం సరిగ్గా అందదు. తద్వారా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యనే పెరిఫరల్ ఆర్టర్ డిసీజ్ అంటారు. దీని కోసం లిపిడ్ ప్రోపైల్ పరీక్ష చేస్తారు.
మీరు మీ ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా కూడా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను అరికట్టవచ్చు. రోజూ వ్యాయామం చేయడం, దంపుడు బియ్యం, సజ్జలు, జొన్నలు, ఓట్స్, బాదం, ఆక్రోట్ నట్స్, ఆపిల్, ద్రాక్ష, నారింజ లాంటి పండ్లను తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ ను తగ్గించవచ్చు.
Also Read: Uric Acid: యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, ఎంత ఉండాలి, ఎలా నియంత్రించాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook