Health Care Tips: మెరుగైన ఆరోగ్యానికి నీళ్లు చాలా అవసరం. తగినంత నీరు తాగకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. నీళ్లు తక్కువ తాగడం వల్ల ఏయే సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మెరుగైన ఆహారపు అలవాట్లతో పాటు రోజుకు తగినంత నీళ్లు కూడా తాగాల్సి ఉంటుంది. మనిషి రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. నీళ్లు తగినంత తాగకపోతే ముందుగా ఏర్పడే సమస్య డీహైడ్రేషన్. మనిషి శరీరంలో 60 శాతం నీళ్లే ఉంటాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ఇది చాలా అవసరం. రోజుకు 2 లీటర్ల నీళ్లు తాగితేనే..శరీరానికి కావల్సిన 60 శాతం నీళ్లు పూర్తవుతాయి. ప్రతిరోజూ తగినంత నీళ్లు తీసుకోకపోతే పలు వ్యాధులు చుట్టుముడతాయి. నీటి కొరత కారణంగా ఏయే వ్యాధులు వస్తాయో పరిశీలిద్దాం..
స్థూలకాయం అనేది పలు ఇతర వ్యాధులకు వేదిక. నీళ్లు తక్కువ తాగే అలవాటున్నవారికి ఈ సమస్య తలెత్తవచ్చు. కొంతమంది ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా..తాగే నీరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. తగినంత నీరు తాగకుండా అలసత్వం ప్రదర్శిస్తుంటారు. ఫలితంగా తరచూ ఆకలేయడం, ఎక్కువగా తినడం వంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నీళ్లు తక్కువగా తాగేవారికి స్థూలకాయం ఓ సమస్యగా మారుతుంది.
నీళ్లు తక్కువగా తాగేవారిలో ప్రధానంగా కన్పించే మరో రుగ్మత నోటి దుర్గంధం. నీళ్లు తక్కువగా తాగడం వల్ల నోట్లో బ్యాక్టీరియా పుడుతుంది. ఫలితంగా నోట్లోంచి దుర్వాసన వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాల్సిందే.
మరో ముఖ్యమైన సమస్య ముఖం కాంతి విహీనంగా మారడం. నీళ్లు తక్కువగా తాగితే ముఖంపై కాంతిని కోల్పోతారు. అంతేకాదు..ముఖంపై పింపుల్స్ ఏర్పడుతాయి. ముఖాన్ని కాంతివంతంగా ఉంచుకోవాలంటే..తప్పకుండా తగినంత నీళ్లు తాగాల్సిందే.
Also read: Monsoon Health Tips: వర్షాకాలంలో చర్మంపై దద్దుర్లు, దురద సమస్యగా ఉందా..ఈ మూడు చిట్కాలతో మటుమాయం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook