మధుమేహం వ్యాధికి నియంత్రణ ఎంత సులభమో..నిర్లక్ష్యం చేస్తే అంతటి ప్రమాదకరం. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులతో డయాబెటిస్ నియంత్రణ సాధ్యమే. ఏం చేస్తే మధుమేహం నియంత్రించవచ్చో తెలుసుకుందాం..
ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో విస్తరిస్తున్న పలు వ్యాధుల్లో ప్రమాదకర వ్యాధి డయాబెటిస్. సరైన చికిత్స లేకపోగా, నియంత్రణ మాత్రం ఉంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకుంటే పలు సమస్యలకు దారితీస్తుంది. మరి నియంత్రణ ఎలా..దీనికి సమాధానమే ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు. తద్వారా డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇందులో ముఖ్యమైంది ఆరోగ్యకరమైన డైట్, మంచి నిద్ర, బ్లడ్ షుగర్ చెకింగ్ వంటివి అలవాటు చేసుకోవాలి. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయాలంటే ఉదయం వేళ కొన్ని పనులు తప్పకుండా చేయాలి.
ప్రతిరోజూ ఉదయం తప్పకుండా చేయాల్సిన 5 పనులు
రోజువారీ దైనందిక జీవితం ఎప్పుడూ ఆరోగ్యకరంగా ప్రారంభించాలి. అంటే మీరు తినే బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ ఆరోగ్యకరమైందిగా ఉండాలి. ప్రతిరోజూ ఉదయం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఉదయం వేళ డైట్ హెల్తీగా ఉంటే..రోజంతా బాగుంటుంది.
ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే 1-2 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఉదయం లేచినవెంటనే కనీసం ఒకట్రెండు గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. గోరువెచ్చని నీళ్లైతే మరీ మంచిది. ఈ అలవాటు మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా ప్రేవుల్ని శుభ్రం చేస్తుంది.
డయాబెటిస్ రోగులు ఎప్పటికప్పుడు తమ బ్లడ్ షుగర్ చెక్ చేస్తుండాలి. దీనివల్ల అప్రమత్తంగా వ్యవహరించేందుకు వీలవుతుంది. ఉదయం పరగడుపున చెక్ చేసుకుంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ఇలా చేయడం వల్ల అవసరమైతే వైద్యుడిని సంప్రదించే పరిస్థితి ఉంటుంది.
Also read: Frequent Urination: తరచూ మూత్రం వస్తోందా, ఈ ప్రమాదకర వ్యాధులు కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook