Buttermilk Health Benefits: చల్లని ఫ్రూట్ జ్యూస్ ఓ వైపు, చల్లని మజ్దిగ మరోవైపు. మీ ఛాయిస్ ఏదవుతుంది. మీకే కాదు ఎవరైనా సరే మజ్జిగ ఎంచుకోవడమే ఉత్తమం. మజ్జిగతో కలిగే ఆ అద్భుత ప్రయోజనాలేంటో చూద్దాం
శీతాకాలం అయిపోవచ్చింది. ఇక మండే వేసవి ప్రారంభం కానుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవిలో ప్రధానంగా శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన జ్యూస్, షేక్స్ తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచాలి. అన్నింటికంటే ముఖ్యమైనది చల్లని మజ్జిగ. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల నిజంగానే అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ప్రతిరోజూ మజ్జిక క్రమం తప్పకుండా తీసుకుంటే ఏ విధమైన అనారోగ్యం దరిచేరదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేదంలో మజ్దిగను కేవలం ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకే కాకుండా కొన్ని రకాల వ్యాధుల చికిత్సకు కూడా ఉపయోగిస్తుంటారు. మజ్జిగ అనేది సులభంగా జీర్ణమవడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కఫం, వాతం లేకుండా చేస్తుంది. అంతేకాకుండా ఆయుర్వేద వైద్యం ప్రకారం నొప్పి, అజీర్తి, గ్యాస్ట్రో సమస్యలు, ఆకలి మందగించడం, స్ప్లీన్ సమస్యలు, ఎనీమియాకు మజ్జిగ ప్రధానంగా ఉపయోగిస్తారు.
మజ్జిగ ఎలా తయారు చేస్తే మంచిది
పావు కప్పు పెరుగు, ఓ కప్పు నీళ్లు బాగా కలిపి చిటికెడు ఉప్పు కలుపుకోవాలి. జీరా పౌడర్ అర టీ స్పూన్ కలుపుకుని..కొన్ని పుదీనా, కొత్తిమీర అకులు , కొద్దిగా అల్లం చాప్ కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ప్రతిరోజూ మద్యాహ్నం భోజనం తరువాత ఓ గ్లాసు మజ్జిగ ఇలా తీసుకుంటే చాలా మంచిది. వేడి చేయకుండా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.
Also read: Green Tea: డయాబెటిస్, ఒబెసిటీకు అద్భుతమైన ఔషధం గ్రీన్ టీ, ఎవరు తీసుకోకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook