Biryani leaf: బిర్యానీ ,పలావ్ వంటివి చేసినప్పుడు కమ్మటి వాసన ఇవ్వడం కోసం ఎక్కువగా ఉపయోగించేది బిర్యాని ఆకు. ఇది కేవలం ఆహారంలో రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. మామూలుగా బిర్యానీ వండడానికి ఉపయోగించే ఈ ఆకుతో చేసుకున్న టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు.
మంచి సువాసనతో పాటు ఇది మన శరీరంలో పలు రకాల సమస్యలను తగ్గిస్తుంది. మరి బిర్యానీ ఆకులతో టీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా..
బిర్యానీ ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో బాగా మరిగించాలి. తర్వాత వీటిని వడకట్టి గోరువెచ్చగా సేవించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. రుచికి తగినట్టుగా దీంట్లో కావాలి అనుకుంటే కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ సమస్య ఉన్నవారికి ఇలా బిర్యాని ఆకుతో చేసిన టీ తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇది మీ రక్తంలోని చక్కర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
రక్తంలో బాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నవాళ్లు కూడా ఇలా బిర్యాని ఆకుతో చేసిన టీ తీసుకోవడం మంచిది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు ,ఛాతి నొప్పి.. గురక నొప్పి వంటి ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఈ టీ తీసుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందుతారు. ఆడవారు ఎక్కువగా బాధపడే రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఈ కషాయం కాపాడుతుంది. బిర్యానీ ఆకుతో చేసిన కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గుతుంది.
జుట్టు రాలడం ,చుండ్రు వంటి సమస్యలను కూడా తగ్గించడంలో ఈ బిర్యానీ ఆకు బాగా సహాయపడుతుంది. మీ తలలో ఇచ్చింగ్ ఎక్కువగా ఉన్నా ,చుండ్రు సమస్య బాధపడుతున్నా.. బిర్యానీ ఆకులు బాగా నీటిలో మరిగించి.. ఆ నీటిని గోరువెచ్చగా అయిన తరువాత తలకు బాగా మర్దన చేసి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఎలా చేయడం వల్ల మీ స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఇన్ఫెక్షన్స్ కూడా దూరం అవుతాయి. జుట్టు మృదువుగా మారి దట్టంగా పెరుగుతుంది.
Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?
Also Read: TDP-Janasena: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ-జనసేన పోరాటం.. ఉమ్మడి తీర్మానాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Bay leaf: బిర్యానీ ఆకు టి తో ఎన్నో లాభాలు.. తెలిస్తే షాక్..