Onion Juice Benefits: ఆధునిక జీవితంలో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారుతోంది. స్థూలకాయం తగ్గించేందుకు చాలా చిట్కాలున్నాయి. అయితే వేగంగా బరువు తగ్గించుకోవాలంటే..ప్రతి కిచెన్‌లో లభించే ఆ ఒక్క పదార్ధం చాలు.
ఉల్లిపాయలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. చాలా వ్యాధుల్ని దూరం చేస్తాయి. ఉల్లిరసంలో ఉండే గుణాలు బరువును అద్భుతంగా తగ్గించడంలో దోహదపడతాయి. బరువు తగ్గించేందుకు ఉల్లిరసం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..
ఉల్లిరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్ శరీరంలో కొవ్వు చేరకుండా నియంత్రిస్తాయి. ఫలితంగా బరువు తగ్గుతుంది. ఉల్లిరసం సేవించడం వల్ల స్థూలకాయం సమస్య దూరమౌతుంది. బరువు తగ్గించేందుకు ఉన్న వివిధ రకాల చిట్కాల్లో ఉల్లి అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ఉల్లిరసం
ఉల్లిరసం తీసుకోవడం వల్ల బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. బరువు తగ్గించేందుకు ఇతర జ్యూస్‌లు తాగినట్టే ఉల్లిజ్యూస్ తాగవచ్చు. ఉల్లిని మిక్సీలో ఆడించి జ్యూస్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల కొవ్వు వేగంగా బర్న్ అవుతుంది.
ఉల్లి సూప్
బరువు తగ్గించేందుకు ఉల్లి సూప్ తయారు చేసి డైట్‌లో భాగంగా చేసుకోవాలి. ఉల్లిపాయల్ని ముక్కలుగా చేసుకోవాలి. నీళ్లలో ఉడికించాలి. సూప్‌లో అవసరమైతే కొన్ని ఇతర కూరగాయలు కూడా కలపవచ్చు. సూప్‌ను బాగా ఉడికించి..ఉప్పు కొద్దిగా కలపాలి. కొద్దిగా నిమ్మకాయ రసం కలపాలి. బరువు తగ్గించేందుకు ఈ పద్ధతి అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ఉల్లిపాయ సలాడ్
చాలామంది ఉల్లిపాయను సలాడ్ రూపంలో తీసుకుంటారు. రోజూ ఉల్లిపాయ తింటే మీకు తెలియకుండానే బరువు తగ్గించుకోవచ్చు. పచ్చి ఉల్లిపాయతో కూడా బరువు తగ్గించుకోవచ్చు. రోజూ ఉల్లిపాయను సలాడ్ రూపంలో తీసుకుంటే బరువు చాలా వేగంగా తగ్గుతుంది.
Also read: Tomato Side Effects: టొమాటోతో కలిగే నష్టాలు, ఈ తీవ్ర వ్యాధులకు కారణం కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook