Hair Care: ఒత్తయిన, పొడవాటి జుట్టు కోసం 5 ఫుడ్స్... ఇవి తింటే బట్టతల వస్తుందనే భయమే అక్కర్లేదు..

Hair Care Tips: మీ జుట్టు రాలుతోందా... లేక నిర్జీవంగా మారుతోందా... బట్టతల వస్తుందేమోనన్న భయం వెంటాడుతోందా.. అయితే మీ డైట్‌లో వీటిని చేర్చడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 03:10 PM IST
  • మీ జుట్టు రాలుతోందని బాధపడుతున్నారా
  • బట్టతల వస్తుందేమోనన్న భయం వెంటాడుతోందా
  • ఈ ఐదు ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మీ జుట్టు ఆరోగ్యవంతంగా తయారయ్యే అవకాశం ఉంది
Hair Care: ఒత్తయిన, పొడవాటి జుట్టు కోసం 5 ఫుడ్స్... ఇవి తింటే బట్టతల వస్తుందనే భయమే అక్కర్లేదు..

Hair Care Tips: కొద్దిగా జుట్టు రాలడం మొదలైందంటే చాలు చాలామంది బట్టతల వస్తుందేమోనని భయపడిపోతారు. తలపై జుట్టు లేకుండా తమను తాము అస్సలు ఊహించుకోలేరు. మార్కెట్లో దొరికే ఏవేవో ప్రొడక్ట్స్ ట్రై చేస్తారు. అవి ఫలితాన్ని ఇవ్వొచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. అయితే ఆరోగ్యవంతమైన జట్టుకు మంచి తిండి కూడా అవసరం. పోషకాహారాలతో కూడిన మంచి డైట్ తీసుకోవడం ద్వారా జుట్టు రాలడం, జుట్టు నిర్జీవంగా మారడం వంటి సమస్యల నుంచి బయటపడుతారు. ముఖ్యంగా ఐదు రకాల ఫుడ్స్ జుట్టు మందంగా, పొడవుగా, ఆరోగ్యవంతంగా ఉండటంలో దోహదపడుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

1. గుడ్లు :

మీ జుట్టు మందంగా, ధృఢంగా ఉండాలంటే గుడ్లు తినాలి. జుట్టు పెరుగుదలకు ప్రొటీన్‌ అవసరం. ప్రొటీన్‌ లేకపోవడం వల్ల జుట్టు పెరుగుదల ఉండదు. కాబట్టి జుట్టు పెరిగేందుకు ప్రొటీన్ తీసుకోవాలి. గుడ్లు తీసుకోవడం ద్వారా ప్రొటీన్లే కాదు జింక్, సెలీనియం, విటమిన్ ఏ, డి, బి 12 కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతీ రోజూ ఒక గుడ్డు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. 

2. వేరుశెనగ, పీనట్ బటర్...

వేరుశెనగ లేదా పీనట్ బటర్ తీసుకోవడం జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్‌తో పాటు, విటమిన్ ఇ, బయోటిన్ ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టును ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఇవి దోహదపడుతాయి.

3. పాలకూర

పొడవాటి జుట్టు కావాలంటే మీ డైట్‌లో పాలకూర ఉండేలా చూసుకోండి. పాలకూర శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఐరన్, ఫోలేట్‌తో పాటు పలు విటమన్లు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో దోహదపడుతాయి.

4. డ్రై ఫ్రూట్స్ 

డ్రై ఫ్రూట్స్‌లో కొవ్వు ఆమ్లాలు, జింక్, విటమిన్ ఇ, బి ఉంటాయి, వీటిని తీసుకోవడం ద్వారా జుట్టుకు పూర్తి పోషణ లభిస్తుంది. జుట్టు రాలడం, జుట్టు నిర్జీవంగా తయారవడం వంటి సమస్యలు నయమవుతాయి. కాబట్టి మీ ఆహారంలో తప్పనిసరిగా డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుకోవాలి.

5. సిట్రస్ పండ్లు

దానిమ్మ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సెల్ డ్యామేజ్‌ను నివారించడంతో పాటు జుట్టు పెరుగుదలకు దోహదపడుతాయి.

(గమనిక: ఇక్కడ తెలిపిన వివరాలు సాధారణ సమాచారం, అంచనాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు కచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News