Foods To Avoid In Weight Loss: ప్రస్తుతం బరువు తగ్గడం చాలా కఠినమైపోంది. అంతేకాకుండా చాలా మంది ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి సందర్భంలో పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో తప్పకుండా తినకూడని ఆహారాలపై ప్రత్యే శ్రద్ధ వహించడం కూడా చాలా మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు. బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల డైట్లను కూడా అనుసరిస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. అయితే దీని కోసం పలు రకాల నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పలు ఆహారాలను కూడా మానేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వీటిని అస్సలు తినొద్దు:
1. పెరుగు తీసుకోవడం:
పెరుగులో కూడా చక్కెర పరిమాణం అధికంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకున్నవారు ఈ పెరుగును తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో మాక్రోన్యూట్రియెంట్ పరిమాణం కూడా అధికంగా ఉంటాయి. హెల్తీగా బరువు తగ్గాలనునే వారు ఈ పెరుగును అస్సలు తినకూడదు. పెరుగులో పుష్కలంగా ప్రోటీన్ ఉంటాయి. ఇదే పెరుగులో హెల్తీ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అయితే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
2. వివిధ రకాల బ్రెడ్స్:
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. శుద్ధి చేసిన బ్రెడ్ తీసుకోకూడదని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ప్రాసెస్ పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలకు కూడా దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే బ్రెడ్‌కు బదులుగా బ్రౌన్ రైస్ ఇతర ఆహారాలను తీసుకోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు.
3. ఫ్రూట్ జ్యూస్:
ఫ్రూట్ జ్యూస్‌లు శరీరానికి చాలా మంచివని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో అధిక పరిమాణంలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అయితే వీటిని తరచుగా తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలను పెంచే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!
Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి