Fainting After Corona Vaccination: అమెరికాలో గత నెల ప్రారంభంలో టీకా కేంద్రాల్లో జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ డోసు తీసుకున్న అనంతరం కొందరిలో మూర్ఛ, కళ్లు తిరగటం, స్వల్పంగా తలనొప్పి, అధిక శ్వాసక్రియ లాంటి లక్షణాలను గుర్తించారు. దర్యాప్తు జరుగుతున్న సమయంలో తాత్కాలికంగా ఆ వ్యాక్సినేషన్ కేంద్రాలను మూపివేశారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కింద ప్రజలకు టీకాలు అందిస్తుంది. కరోనాపై పోరుకు వ్యాక్సిన్ సైతం ఓ మార్గమని తెలిపింది.
టీకా తీసుకున్న వారిలో కొన్ని లక్షణాలు గుర్తించిన అనంతరం దీనిపై సమీక్ష జరపగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. కరోనా టీకాల ప్రభావంతో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆ లక్షణాలు కనిపించలేదని, అయితే వారు టీకా గురించి ఆందోళన చెందడంతో అస్వస్థతకు గురయ్యారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నిర్ధారించింది. మోర్బిడిటీ అండ్ మోర్టాలిటీ వీక్లీ రిపోర్టులో ఈ విషయాలను ధ్రువీకరించింది. గతంలో ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్(COVID-19 Vaccine) ఇచ్చిన సమయంలోనూ ఇలాంటి ఘటనలో చోటుచేసుకున్నాయని స్పష్టం చేసింది.
Also Read: Risk Factors For Covid-19: కరోనా వీరికి సోకితే మరింత ప్రమాదకరం.. ప్రాణాలు కూడా పోతాయి
టీకా తీసుకున్న వారిలో 56 శాతం మందిలో స్వల్పంగా తలనొప్పి, 31 శాతం మందిలో అధికంగా చెమట రావడం, 27 శాతం వారిలో మూర్ఛ, 25 శాతం మందిలో వాంతులు, వికారం, బీపీ లాంటి లక్షణాలు 16 శాతం మందిలో కనిపించాయని సీడీసీ పేర్కొంది. సాధారణంగా ఇంజెక్షన్ తీసుకోవడం లేదా కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం లాంటి విషయాలలో నెలకొన్న ఆందోళన కారణంగా వారిలో COVID-19 టీకా తీసుకున్న అనంతరం కొన్ని అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆడవారిలో ఆ లక్షణాలు అధికంగా కనిపిస్తాయని, ఆందోళన తగ్గించుకుంటే వ్యాక్సిన్ పనితీరు సైతం తీసుకున్నవారిలో మెరుగ్గా ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Cancer Patients: క్యాన్సర్ బాధితులకు COVID-19 సోకితే మరింత ప్రమాదకరం, ఈ విషయాలు తెలుసుకోండి
కొందరిలో ప్రస్తుతం కరోనా కారణంగా తలెత్తుతున్న విపత్కర పరిణామాలు ఆందోళనకు గురిచేస్తాయని సీడీసీ పేర్కొంది. టీకా తీసుకున్న వారిలో పలానా లక్షణాలు కనిపించాయి, వారికి పలానా విధంగా జరిగిందనే ప్రచారం కూడా మరికొంత మందిలో వ్యాక్సిన్లు, ఇంజెక్షన్లపై అనుమానాలు తలెత్తేలా చేస్తుంది. తద్వారా వారు మానసికంగా భయానికి లోను కావడంతో కళ్లు తిరగడం, మూర్ఛ పోవడం, వాంతులు చేసుకోవడం లాంటివి జరుగుతాయని సీడీసీ నిపుణులు స్పష్టం చేశారు.
Also Read: Covid-19 Vaccination: కరోనా వ్యాక్సిన్‌పై మరో ఆసక్తికర విషయం వెల్లడించిన నిపుణులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook