Summer Hair Care Tips: వేసవి కాలంలో ఈ టీతో మీ జుట్టు సమస్యలకు 5 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు

Easy Summer Hair Care Tips: ఎండా కాలంలో జుట్టును సంరక్షించుకోవడానికి తప్పకుండా పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2023, 12:42 PM IST
Summer Hair Care Tips: వేసవి కాలంలో ఈ టీతో మీ జుట్టు సమస్యలకు 5 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు

Easy Summer Hair Care Tips: వేసవి కాలంలో జుట్టు, చర్మం సమస్యలు రావడం సర్వసాధరణం.. వేడి గాలి కారణంగా జుట్టు, ముఖంపై చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల చిట్కాలను పాటించడం వల్ల కూడా జుట్టు, చర్మాన్ని ఎండ నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే మీ కోసం నిపుణులు సూచించిన కొన్ని ప్రత్యేకమైన సమ్మర్ హెయిర్ కేర్ చిట్కాలను తెలపబోతున్నాం.. వాటితో మీరు సులభంగా మీ హెయిర్‌ను రక్షించుకోవచ్చు. కాబట్టి ఆ చిట్కాలేంటో వాటిని ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ చిట్కా తప్పకుండా పాటించండి:
1. చిన్న బాణలిలో కొబ్బరి నూనెను వేసి.. అందులో 8 నుంచి 10 కరివేపాకులను వేయాలి. ఆ ఆకులు నల్లగా వేగిన తర్వాత  చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఆ నూనెను ఒక బాటిల్‌లో నిల్వ చేసుకుని క్రమం తప్పకుండా జుట్టు అప్లై చేసి మసాజ్‌ చేసి 5 గంటల తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు పొందొచ్చు. అంతేకాకుండా జుట్టు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

2. ఈ గోరువెచ్చని నూనెతో జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు కూడా సులభంగా నల్లగా మారుతుంది. అంతేకాకుండా తీవ్ర జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా దీనిని స్కిన్‌కి అప్లై చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

3. బొప్పాయి మిశ్రమాన్ని వినియోగించడం వల్ల కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. అయితే దీనితో తయారు చేసిన మిశ్రమాన్ని జుట్టు చివరల అప్లై చేసి 20 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేయాల్సి ఉంటుంది. .

4. బ్లాక్‌ టీ వల్ల కూడా సమ్మర్‌లో వచ్చే జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాను వినియోగించడం వల్ల కోల్పోయిన షైన్‌ని కూడా తిరిగి పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం బ్లాక్ టీ పౌడర్‌ తీసుకుని అందులో రోజ్‌ వాటర్‌ వేసి జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Best Mileage Petrol Car: రూ. 5.3 లక్షలకే అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Also Read: Anchor Anasuya Pics : బుల్లి నిక్కర్‌లో అనసూయ ఆసనాలు.. పిచ్చెక్కిస్తోన్న ఫోటోలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News