Diabetes Control Tips: మధుమేహంతో బాధపడుతున్నవారు.. ఇలా డ్రై ఫ్రూట్స్‌ను తీసుకుంటే చాలు..

Dry Fruits In Diabetes: డయాబెటిస్‌తో బాధపడేవారు తప్పకుండా ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు రకాల విషయాలపై జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శరీరం బలహీనంగా మారితే ప్రాణాంతక సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2022, 02:53 PM IST
  • మధుమేహంతో బాధపడుతున్నారా
  • అయితే వాల్‌నట్స్‌ను తీసుకోండి.
  • జీడిపప్పును తప్పకుండా తీసుకోండి.
Diabetes Control Tips: మధుమేహంతో బాధపడుతున్నవారు.. ఇలా డ్రై ఫ్రూట్స్‌ను తీసుకుంటే చాలు..

Dry Fruits In Diabetes: డయాబెటిస్‌తో బాధపడేవారు తప్పకుండా ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు రకాల విషయాలపై జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శరీరం బలహీనంగా మారితే ప్రాణాంతక సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి. అయితే మధుమేహం ఉన్నవారు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం తప్పకుండా పలు రకాల డ్రై ఫ్రూట్స్‌ను వినియోగించాలి. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని యాక్టివ్‌గా చేయడమేకాకుండా మధుమేహాన్ని నియంత్రించేందుకు సహాయపడుతుంది.

మధుమేహం వ్యాధిగ్రస్తులు ఏ డ్రై ఫ్రూట్స్ తినాలి:

వాల్‌నట్‌లు:
మధుమేహంతో బాధపడుతున్నవారు వాల్‌నట్స్‌ తీసుకోవాలి. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉండడమేకాకుండా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇందులో  విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. వాల్‌నట్‌లను తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది.

బాదం:
మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా బాదంపప్పు తినాలి. బాదంలో ఉండే పోషకాలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిపై ప్రభావవం చూపుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్ రోజూ నానబెట్టిన బాదంపప్పును తినాలి.

జీడిపప్పు:
జీడిపప్పు తినడం వల్ల శరీరానికి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండె జబ్బులను తగ్గిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ డ్రైఫ్రూట్‌ను తీసుకోవాలి.

పిస్తాపప్పులు:
ఆధునుక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పిస్తాలో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ సి, జింక్, కాపర్, పొటాషియం, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

డయాబెటిస్ ఉన్నవారు ఏ డ్రైఫ్రూట్స్ తినకూడదు:
మధుమేహంతో బాధపడుతున్నవారు ఎక్కువ పరిమాణంలో ఎండుద్రాక్ష తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలను పెంచే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Read Also: TRS VS MIM: పీకే బాటలోనే ఎంఐఎం.. కేసీఆర్ తో దోస్తీ కటీఫ్! 30 నియోజకవర్గాల్లో కారుకు గండం..

Read Also: Telangana Rain Alert : తెలంగాణలో మరో వారం కుండపోతే.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News