Dry Fish Health Benefits In Telugu: చేపల కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..అందరూ ఎంతగానో ఇష్టపడి తింటూ ఉంటారు. చేపల్లో చాలా రకాలుంటాయి. అందులో చాలా మంది పులస, చందమామ చేపలు, కొర్రమెనులను ఇంష్టంగా తింటూ ఉంటారు. వీటి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా గుండె పని తీరును కూడా మెరుగు పరుచుతుంది. కాబట్టి అప్పుడప్పుడు చికెన్‌కి బదులుగా చేపలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎండు చేపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా రకాల లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఎండు చేపల్లో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్స్ కూడా అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఎండు చేపల ప్రయోజనాలు:
❃ ఎండు చేపల్లో కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
❃ ఎండు చేపలో ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి శరీరంలోని దెబ్బ తిన్న కణజాలాన్ని నిర్మించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు శరీరంలోని హార్మోన్లు, ఎంజైమ్‌లు, ఇతర రసాయనాల సమతుల్యం చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
❃ ఈ చేపల్లో శరీరంలోని యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను తగ్గించే గుణాలు కూడా లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల సమస్యలు కూడా దూరమవుతాయి.
Also read: AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
❃ ఈ ఎండు చేపలో శరీరానికి ఎంతో ప్రయోజనకరమైన ఒమేగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల రక్తనాళాలు శుభ్రమవుతాయి. దీంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా లీటా చేపలో ఒమేగా-3-కొవ్వు ఆమ్లాలు చాలా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని వారానికి ఒక రోజు ఆహారంగా తీసుకుంటే రక్తం గడ్డకట్టడం సమస్య నుంచి ఉపశమనం లభించి, రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించేందుకు సహాయపడుతుంది.
Also read: AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి