Covaxin License: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. మరి కొంతకాలం అత్యవసర అనుమతితోనే కొనసాగాల్సిన పరిస్థితి. పూర్తి స్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డీసీజీఐ నిరాకరించడం ప్రాముఖ్యత సంతరించుకుంది.
దేశంలో అందుబాటులో ఉన్న మూడు వ్యాక్సిన్లలో ఒకటి మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్(Covaxin vaccine). భారత్ బయోటెక్ (Bharat Biotech)కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అత్యవసర అనుమతితో అందుబాటులో ఉంది. అయితే గత కొద్దికాలంగా కోవాగ్జిన్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో ఇబ్బంది ఎదురవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన, అనుమతించిన అత్యవసర వ్యాక్సిన్ల జాబితాలో ఇది లేకపోవడమే. అటు యూఎస్‌ఎఫ్‌డీఏ(USFDA) కూడా అమెరికాలో కోవాగ్జిన్‌కు అనుమతించలేదు.
మరోవైపు ఇండియాలో కూడా కోవాగ్జిన్‌కు చుక్కెదురైంది. కోవాగ్జిన్‌కు(Covaxin vaccine) పూర్తి స్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డీసీజీఐ (DCGI)నిరాకరించింది. మరింతగా క్లినికల్ ట్రయల్స్ డేటా అవసరమని కోరింది. ఫలితంగా పూర్తి స్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు మరో ఏడాది పట్టవచ్చని తెలుస్తోంది. ఇక గర్భిణీలకు ఈ వ్యాక్సిన్ వినియోగించవద్దని డీసీజీఐ తెలిపింది. తాజాగా తమ వ్యాక్సిన్‌కు 77.8 శాతం సామర్ధ్యముందని చెబుతూ క్లినికల్ డేటాను డీసీజీఐకు సమర్పించింది భారత్ బయోటెక్. 25 వేల 8 వందలమందిపై నిర్వహించిన మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను డీసీజీఐకు ఇచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook