Natural Drink For Anemia: రక్తహీనత అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. రక్తంలో ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటాయి. హిమోగ్లోబిన్ అనేది రక్తంలోని ఒక ముఖ్యమైన భాగం, ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. రక్తహీనత వల్ల శరీరంలో ఆక్సిజన్ తక్కువగా ఉండి, అనేక సమస్యలకు దారి తీస్తుంది. రక్తహీనత సమస్య రావడానికి కొన్ని ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో ఐరన్, విటమిన్ B12, ఫోలేట్ వంటి పోషకాల లోపం రక్తహీనతకు ప్రధాన కారణం. దీని వల్ల క్యాన్సర్, కిడ్నీ వ్యాధి, క్రోన్స్ వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధులు రక్తహీనతకు దారితీయవచ్చు. అలాగే తలసేమియా, సికిల్ సెల్ అనీమియా వంటి జన్యుపరమైన పరిస్థితులు కూడా రక్తహీనతకు కారణమవుతాయి.
రక్తహీనత సమస్యను ఎలా గుర్తించాలి:
రక్తహీనత సమస్య ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే కొన్ని లక్షణాలు శరీరంలో కనిపిస్తాయి. అందులో మొదటిది అలసట. ఉదయం ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్న శరీరం అలసటగా అనిపిస్తుంది. అంతేకాకుండా కొంత దూరం నడిచిన తరువాత నీరసంగా ఉంటుంది. కొంతమందిలో తల తిరగడం వంటి సమస్య ఉంటుంది. ఎక్కువగా గుండె కొట్టుకుంటూ జరుగుతుంది. మరి కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. రక్తహీనతకు చర్మం లేతగా మారడం, శరీరం చల్లదనం గా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కూడా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
అయితే ఈ మధ్యకాలంలో ఎలాంటి మందులు, చికిత్సలు లేకుండా కొన్ని సాధారణ సమస్యలకు ఇంటి చిట్కాలను ఉపయోగించి సమస్యను నయం చేసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రక్తహీనత ఉన్నవారు ప్రతిరోజు ఈ చిట్కాను పాటించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. దీని కోసం ఇంట్లోనే ప్రతిరోజు ఉపయోగించే పదార్థాలు వాడుతే సరిపోతుంది. అందులో బీట్ రూట్, క్యారెట్, దానిమ్మ గింజలు ఖర్జూరం వంటి పదార్థాలు ఉపయోగించాలి. వీటిని ఉపయోగించి జ్యూస్ తయారు చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు తీసుకోవడం వల్ల ముఖ్యంగా మహిళలు దీని తాగడం వల్ల రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో ఎలాంటి నష్టాలు కలగకుండా ఉంటుంది.
ఎందుకు ఈ పదార్థాలు మంచివి?
బీట్‌రూట్: ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
క్యారెట్: క్యారెట్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది శరీరం ఐరన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది.
దానిమ్మ గింజలు: దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను రక్షిస్తాయి.
ఖర్జూరం: ఖర్జూరంలో ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి.
కావాల్సిన పదార్థాలు:
బీట్‌రూట్ ముక్కులు
క్యారెట్ ముక్కలు
దానిమ్మ గింజలు
ఖర్జూరం
నీరు
జ్యూస్ తయారీ:
ముందుగా పైన చెప్పిన పదార్థాలను శుభ్రంగా కడగాలి. బీట్‌రూట్, క్యారెట్‌ను ముక్కలు చేసుకోవాలి. దానిమ్మ గింజలను వేరు చేయాలి. ఖర్జూరాలను నీటిలో నానబెట్టి తొక్క తీసివేయాలి. ఇప్పుడు అన్ని ముక్కలను బ్లెండర్ జార్‌లో వేసి, కావలసినంత నీరు కలిపి బ్లెండ్ చేయాలి.
ఈ జ్యూస్‌ను చల్లగా సర్వ్ చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ఈ జ్యూస్‌ను పరగడుపున తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ముఖ్యమైన విషయాలు:
ఈ జ్యూస్‌ను రోజూ ఉదయం లేదా రాత్రి భోజనానికి ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
రక్తహీనత తీవ్రంగా ఉంటే, వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
ఈ జ్యూస్‌తో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.
గమనిక:
ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
Also read: Healthy Drink: డయాబెటిస్ నుంచి కిడ్నీ స్టోన్స్ వరకు ఈ టీ ఒక దివ్వ ఔషధం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter