Beetroot Juice Benefits: చాలా మందికి బీట్‌రూట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. దానిని పచ్చిగా తినేందుకు, జ్యూస్ తాగేందుకు వెనుకడుగు వేస్తారు. కానీ నిత్య జీవితంలో ఎదురయ్యే చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది బీట్‌రూట్(Beetroot). బీట్ రూట్ జ్యూస్(juice) తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల శరీరంలో రక్తం మోతాదును పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ A, విటమిన్ B6, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. బీట్ రూట్ జ్యూస్ లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫొలేట్, విటమిన్ సీ, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటివి ఉన్నాయి.. సాధారణంగా హిమోగ్లోబిన్ పెరగడానికే అనుకుంటాం గానీ ఇదొక దివ్య ఔషధమని చాలామందికి తెలియదు.
రక్తహీనతతో బాధపడే వారు బీట్‌రూట్ జ్యూస్ తాగితే(drink) మంచి ఫలితం ఉంటుంది. రక్తం(blood) చాలా త్వరగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి త్వరిత కాలంలోనే బయట పడవచ్చు. ఇక ఇంట్లో పనుల వల్ల రోజంతా నీరసంగా ఉండేవారు. ప్రతిరోజూ ఉదయం బీట్‌రూట్ జ్యూస్(Beetroot juice)తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. శక్తి అందుతుంది. దాంతో చురుగ్గా ఉంటారు. ఏ పనైనా చేయగలుగుతారు. హైబీపీ ఉన్నవారికి బీట్‌రూట్ ఒక ఔషధమనే చెప్పాలి. బీట్‌రూట్‌లో ఉండే పొటాషియం హైబీపీ(High BP)ని తగ్గిస్తుంది. గుండె జబ్బులు(heart problems) రాకుండా చూస్తుంది.
Also Read: Mysterious fever: యూపీలో అంతుచిక్కని వ్యాధి కలకలం...39 మంది మృతి
ఇక కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు బీట్‌రూట్ జ్యూస్ తాగితే మంచిది. కొలెస్ట్రాల్ కరగడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. గర్భిణీలు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల..కడుపులో ఉండే బిడ్డకు మెరుగైన ఫోలిక్ యాసిడ్ (Folic acid) అందుతుంది. ఫలితంగా బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. లివర్ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిది. దీంతో లివర్‌లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోయి..లివర్ శుభ్రమవుతుంది. క్రమం తప్పకుండా బీట్‌రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటే కొంతకాలానికి మీకు తెలియకుండానే మీలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
బీట్ రూట్‌లో బోరాన్ అనే ఖనిజం ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్(Beetroot juice) మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. బోరాన్, నైట్రిక్ ఆక్సైడ్ రెండూ కూడా సెక్స్ హార్మోన్లను ఉత్తేజ పరుస్తాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన శృంగార సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook