Herbal Tea In Monsoon Season: వర్షాకాలంలో తరుచుగా అనారోగ్య సమస్యల బారిన పడుతుంటాము. ఈ సీజన్ లో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. దీని కారణంగా దగ్గు, జలుబు, జ్వరం వంటి ఇతర సమస్యలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఒక సులభమైన మార్గం హెర్బల్ టీలు తాగడం. ఈ టీలు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. ఎలాంటి హెర్బల్ టీలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చో తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన హెర్బల్ టీలు:
తులసి:
తులసి ఒక అద్భుతమైన ఔషధ మొక్క. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. తులసి ఆకులను నీటిలో మరిగించి టీ చేసుకోవచ్చు లేదా తులసి రసం టీలో కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
అల్లం:
అల్లం జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఇందులొ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లం ముక్కలను నీటిలో మరిగించి టీ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
పుదీనా:
పుదీనా జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. వర్షకాలంలో పుదీనా ఆకులను నీటిలో మరిగించి టీ తయారు చేసుకొని తాగడం చాలా మంచిది.
మరిగోల్డ్:
మరిగోల్డ్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. దీని ఉదయం టీ, కాఫీలకు బదులుగా తీసుకోవడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది.
లీకోరైస్:
లీకోరైస్ జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తుంది.
పెప్పర్‌మెంట్:
పెప్పర్‌మెంట్ టీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది రోగనిరోధక శక్తి పెంచడంలో కూడా సహాయపడుతుంది.
కమోమిల్:
కమోమిల్ టీ ఒత్తిడి, అలసట వంటి సమస్యలను చిటికెలో తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు ఈ కమోమిల్ టీని తీసుకోవడం వల్ల చక్కటి నిద్ర కలుగుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డిటాక్సిఫై చేయడంలో కూడా ఉపయోగపడుతుంది.
చిట్కాలు:
ఈ హెర్బల్ టీలను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగవచ్చు.
తాజా హెర్బ్‌లతో టీ చేసుకోవడానికి వీలైతే మంచిది.
మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందుగా ఆరోగ్యనిపుణులు సలహా తీసుకోవడం చాలా మంచిది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి