Vitamin B12 Deficiency Symptoms: మనం రెగ్యులర్ గా తినే ఆహారాల్లో.. విటమిన్ బి12 లభిస్తుంది. కానీ కొన్ని సార్లు ఆహార అలవాట్లు వల్ల ఈ విటమిన్ బి12.. లోపించే అవకాశం ఉంది. దీన్ని లోపించవారికి కొన్ని సంకేతాలు.. ఎక్కువగా వస్తాయి. అవేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఎక్కువగా ఆహారపు అలవాట్లు, వైద్య పరిస్థితులు లేదా బి12 తగ్గించే కొన్ని మందుల వాడుక వల్ల విటమిన్ బి12.. లోపం కలుగుతుంది. వయస్సు పెరిగే కొద్దీ ఆహారంలో నుండి బి12 ను గ్రహించగల సామర్థ్యం తగ్గిపోతుంది.. కాబట్టి వయసు పైబడిన వారిలో కూడా ఈ లోపం కనిపిస్తుంది. పిల్లలు, గర్భిణీలలో కూడా ఈ లోపం కనిపిస్తుంది.
బి12 స్థాయిలు తక్కువగా ఉంటే, మన శరీరం మనకి ఎలాంటి సంకేతాలు ఇస్తుందో ఒకసారి చూద్దాం.
అలసట: బి12 లోపం ఉన్నప్పుడు, త్వరగా అలసట అనిపించవచ్చు. శరీర కణాలు సక్రమంగా పనిచేయడానికి బి12 అవసరం. తగినంత బి12.. లేకపోవడం వల్ల, సాధారణ ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోవచ్చు, ఇది ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలిగిస్తుంది. దానివల్ల త్వరగా అలసట వస్తుంది.
చర్మం రంగు మారటం: బి12 లోపం వల్ల చర్మం పసుపు లేదా పచ్చగా మారుతుంది. బిలిరుబిన్ స్థాయిలు పెరగడం వల్ల చర్మం మరియు కంటి తెల్లభాగాలు పసుపు రంగులోకి మారుతాయి.
తలనొప్పి: తలనొప్పి కూడా బి12 లోపం లక్షణాలలో ఒకటి. 2019 లో 140 మంది పై చేసిన అధ్యయనంలో, తలనొప్పితో బాధపడేవారిలో బి12 స్థాయిలు తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
జీర్ణ సంబంధ సమస్యలు: బి12 లోపం కారణంగా జీర్ణ సంబంధ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు రావచ్చు. వాంతులు కూడా ఎక్కువగా అవ్వచ్చు.
నోరు నాలుకలో నొప్పి: బి12 లోపం ఉన్నవారిలో, గ్లొసైటిస్ (నాలుక లో నొప్పి), స్టొమాటిటిస్ (నోరులో చర్మం) కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
పరేస్థేసియా: కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా చేతులు, కాళ్ళలో మంట లాగా.. అనిపించవచ్చు. మెట్ఫార్మిన్ తీసుకునే మధుమేహం ఉన్నవారు ఎక్కువగా బి12 లోపానికి గురవుతారు.
బి12 లోపం వల్ల కండరాల నొప్పి, శక్తి లోపం, ఎనర్జీ తగ్గిపోవడం, దృష్టి సమస్యలు.. కూడా కలగవచ్చు. ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించడం ముఖ్యం.
Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook