Benefits of White Pumpkin Juice: తెల్ల గుమ్మడికాయ.. దాదాపు అందరు చూసే ఉంటారు. ఇంగ్లీష్ లో దీన్ని వైట్ పంప్కిన్ అంటారు. చాలా మంది తెల్ల గుమ్మడికాయ పలు రకాలుగా తింటూ ఉంటారు. కానీ తెల్ల గుమ్మడికాయలో ప్రయాణాలు చాలానే ఉన్నాయి. తెల్ల గుమ్మడికాయలో విటమిన్లు, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫాస్పరస్ అధిక మొత్తంలో ఉంటాయి. మనలో చాలా మందికి మద్యపానం అలవాటు ఉంటుంది. మద్యపానం వలన కాలేయ సంబంధిత వ్యాధులకు లోనవుతుంటారు. అంతేకాకుండా కొంత మంది చిన్న పిల్లల్లలో పోషణ సరిగా లేకుపోవటం కారణంగా మెదడు మెదడు ఎదుగుదల నిలిచిపోతుంది. ఫలితంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెల్ల గుమ్మడికాయ రసం ఎంతో మేలు చేస్తుంది. తెల్ల గుమ్మడికాయ రసం తాగడం వల్ల కలిగె లాభాల గురించి తెలుసుకుందాం.
తెల్ల గుమ్మడికాయ రసం తయారీ విధానం:
ఏదైనా సరే.. తినడానికి,తాగడానికి సరైన విధానం, సరైన సమయం తెలిసి ఉండాలి. అప్పుడే దాని లాభాలను మనం పొందుతాం,తెల్ల గుమ్మడికాయ రసం తాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ ఈ జ్యూస్ చేసే సరైన విధానం మనకి తెలిసి ఉండాలి. ఈ జ్యూస్ ని చేయడానికి ముందుగా తెల్ల గుమ్మడికాయని తీసుకొని.. దాని పొట్టు తీసిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసి జ్యూస్ తయారు చేసుకొని తాగాలి.
కాలేయానికి ఉపయోగకరం:
కాలేయంలో వేడి పెరిగినప్పుడు.. పొట్టలో, చర్మం , ఛాతీలో మంట వంటి సమస్యలు ప్రారంభం అవుతాయి. దీని వల్ల మన శరీరం, ముఖంపై మొటిమలు మరియు దద్దుర్లు రావడం ప్రారంభమవుతుంది. అనారోగ్యకరమైన ఆహారం వల్ల కాలేయంలో మురికి పేరుకుపోతుంది. దాని ప్రభావం మన చర్మంపై కూడా కనిపిస్తుంది. ఇలా కాలేయ వీధిలో కలిగే లోపాలను తెల్ల గుమ్మడికాయ రసంతో చెక్ పెట్టొచ్చు.
Also Read: Good Oil For Kidneys: ఆలివ్ ఆయిల్ కిడ్నీ సమస్యలను తగ్గిస్తుందా.. ఎలా వాడాలో తెలుసా?
మెదడుకు చాలా ప్రయోజకరం:
సాధారణంగా మెదడుకు సంబంధించిన సమస్యలు ఉన్న వారికి చిన్నతనం నుండే ఇలాంటి లోపాలు సంక్రమిస్తాయి. దీనికి కారణం చిన్నప్పుడు వారికి లభించాల్సిన పోషణ లభించకపోవడం. కొంత మందిలో అయితే వయస్సుతో పాటు మైగ్రేన్ సమస్య కూడా పెరుగుతుంది, మరికొందరిలో ఒత్తిడి వల్ల డిప్రెషన్ లోకి వెళ్తారు. మానవ శరీరంలో ఒక కంప్యూటర్ లా పనిచేస్తుంది అవటమే మెదడు. మెదడులో ఎన్నో జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయి. ఈ క్రమంలో మెదడులో తలెత్తే సమస్యల కారణంగా ఆ వ్యక్తి తనకు తానే సమస్యగా తయారు అవుతాడు. ఇలాంటి సమయాల్లో ఈ రసాన్ని క్రమం తప్పకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా మారటమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.
Also Read: Wheat Grass Juice For Weight Loss: గోధుమ గడ్డి రసంతో బరువు తగ్గవచ్చా.. ఇందులో ఉన్న నిజమెంత..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి