Sweet Dishes For Diabetic Patient: మధుమేహంతో బాధపడుతున్నవారికి తీపి పదార్థాలు విషం కంటే ఎక్కువ.. చక్కెర పదార్థాలు అతిగా తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరుగుతాయి. అంతేకాకుండా అనేక రకాల దీర్ఘకాలి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. డయాబెటిస్‌తో బాధపడుతున్నవారికి కూడా తీపి పదార్థాలు తినాలని కోరికలుంటాయి.. కానీ తినలేకపోతారు. ఆరోగ్య నిపుణులు అందిస్తున్న సమచారం ప్రకారం..ఈ కింద పేర్కొన్న తీపి పదార్థాలు మధుమేహం ఉన్న వారు కూడా ప్రతి రోజు తినవచ్చట. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహంతో బాధపడుతున్నవారు ఈ తీపి పదార్థాలు తినొచ్చు:
పచ్చి పెరుగు:
మధుమేహంతో బాధపడుతున్నవారు తీపి పదార్థాలు తినడం వల్ల సులభంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా పెరుగుతాయి. పెరుగులో బెర్రీలు, యాపిల్స్, డ్రై ఫ్రూట్స్ వేసుకుని తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వాల్‌నట్స్:
గుండె ఆరోగ్యంగా ఉండడానికి వాల్‌నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు వీటిని ప్రతి రోజు తీసుకోవడం మంచి ఫలితాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
చియా విత్తనాలు:
చియా గింజలు కూడా ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ప్రోటీన్స్ లభిస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు తినడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ కాపర్ పరిమాణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో కరిగే ఫైబర్ కూడా లభిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో షుగర్ లెవల్స్‌ను నియంత్రించే గుణాలు కూడా లభిస్తాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook