Diabetes control In 5 Days: భారత్‌లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే చాలా మంది చెడు జీవనశైలి కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. మధుమేహం ఉన్నవారిలో చాలా వరకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి వీరు ఆహారంపై ప్రత్యేక శ్రద్ద వహించడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే శరీరంలో చక్కెర పరిమాణం తగ్గాలంటే కచ్చితంగా కొన్ని నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. మధుమేహం ఉన్నవారిలో గుండె సంబంధింత సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. వీరు తీసుకునే ఆహారంలో అధిక చక్కెర పరిమాణాలున్న వాటిని తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మధుమేహం ఉన్నవారు వీటిని ఆహారంగా తీసుకోండి:
>>శరీరంలో మధుమేహం నియంత్రించుకోవడానికి పలు రకాల ఆహారం తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆహారంలో బంగాళాదుంపలు అస్సలు తీసుకోవద్దని నిపుణులు చేబుతున్నారు.
>> మధుమేహంతో బాధపడుతున్నవారు అస్సులు చక్కెర పరిమాణాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవద్దు. ముఖ్యంగా బియ్యంతో చేసిన రైస్ తీసుకోకపోవడం చాలా మంచిది. తరచుగా ఇలాంటి ఆహారాలను తీసుకుంటే తీవ్ర సమస్యగా మారే అవకాశాలున్నాయి.
>>మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు లభించడమేకాకుండా అన్ని అనారోగ్య సమస్యలను నియంత్రిస్తుంది.
>>ముఖ్యంగా వీరు ఆహారంలో పిండి పదార్థాలు, కూరగాయలు, బీన్స్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్లను తీసుకోవాలి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల బాడీకి మంచి లాభాలు చేకూరుతాయి.
>> మాంసాహారులైతే తప్పకుండా ఆహారాల్లో చేపలు, చికెన్ వంటి ఆహారాలున్న పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ప్రయోజనాలు లభిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా ఈ డైట్‌ను అనుసరించడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
>>మధుమేహన్ని సులభంగా నియంత్రించుకునే క్రమంలో తప్పకుండా లంచ్, డిన్నర్ చేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఆహారంలో గ్లూకోజ్ పరిమాణం కూడా పెరుగుతుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook