Dengue Fever Treatment: ఇటీవల డెంగ్యూ కేసులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దోమలు విపరీతంగా వృద్ధి చెందుతుండడంతో వ్యాధులు విస్తరిస్తున్నాయి. డెంగ్యూ కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా డెంగ్యూ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మీరు డెంగ్యూతో బాధపడుతున్నట్లయితే.. త్వరగా రికవరీ అయ్యే పద్ధతులపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. డెంగ్యూ నుంచి మీరు కోలుకోవాలంటే ముందు మంచి ఆహారం తీసుకోవడం ముఖ్యం. డెంగ్యూ సోకినవారిలో జ్వరం, వణుకు, తీవ్రమైన బాడీ పెయిన్స్, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు, చర్మంపై దురదలకు దారితీస్తుంది.
బొప్పాయి ఆకు రసం డెంగ్యూ జ్వరానికి చెక్ పెట్టేందుకు సరైన ఔషధం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు త్వరగా కోలుకోవడానికి ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. మీరు పూర్తి ఆరోగ్యవంతులు అయ్యేందుకు బొప్పాయి ఆకు రసం తీసి అందులో కొంచెం నీరు మిక్స్ చేసి రెండు లేదా మూడు సార్లు తాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మిక్స్‌డ్ కూరగాయల మిశ్రమంతో రసాన్ని తయారు చేసి తాగినా.. సరైన మొత్తంలో పోషకాలను తీసుకోవచ్చు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. త్వరగా కోలుకోవడానికి సరైన పోషణను అందిస్తుంది. మీరు రుచి కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవడం మంచిది. నిమ్మరసం జోడించడం వల్ల మీ రసంలో విటమిన్ సి కంటెంట్ పెరుగుతుంది.
డెంగ్యూ సోకితే డీహైడ్రేషన్ సర్వసాధారణం. కాబట్టి కొబ్బరి నీళ్లను తాగడం మంచిది. ఇది మీ శరీరానికి సరైన పోషకాహారాన్ని అందిస్తుంది. మిమ్మల్ని ఎల్లవేళలా హైడ్రేట్‌గా ఉంచుతుంది. డెంగ్యూ జ్వరంలో ఒక వ్యక్తి రోజుకు సగటున రెండు గ్లాసుల కొబ్బరి నీరు తాగాలి. అలాగే మీరు రోజూ కొబ్బరినీళ్లు తాగవచ్చు. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ ముఖానికి మెరుపును తెస్తుంది.
మీకు టీ తాగే అలవాటు ఉంటే.. అందులో అల్లం, ఏలకులు, దాల్చినచెక్క, లిక్కోరైస్ మొదలైనవి యాడ్ చేసుకోండి. డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు, హెర్బల్ టీ కూడా మీ గొంతును జాగ్రత్తగా చూసుకుంటుంది. మీరు సులభంగా జలుబు నుంచి బయటపడడంతోపాటు రిఫ్రెష్ ఫ్లేవర్ మీ మైండ్‌ని రిఫ్రెష్ చేస్తుంది.
మందులు, సౌందర్య సాధనాలు, రోగనిరోధక శక్తిని పెంచే సాధనాలు మొదలైన అనేక ప్రయోజనాల కోసం వేపను ఉపయోగిస్తారని చాలా మందికి తెలుసు. డెంగ్యూ రోగులకు చికిత్స చేయడంలో వేప ఆకులు ప్రయోజనకరంగా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వైరస్ వ్యాప్తి, పెరుగుదలను ఆపుతుంది. త్వరగా కోలుకోవడానికి మీరు ఎల్లప్పుడూ వేప ఆకులపై ఆధారపడవచ్చు.
డెంగ్యూ జ్వరానికి సరిపడని అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి. మీరు మీ ఆహారంపై ఎక్కువ శ్రద్ధ చూపకపోతే ఈ ఆహార పదార్థాలు మీ వేగవంతమైన రికవరీని నెమ్మదిస్తాయి. నూనె, వేయించిన ఆహారాలు, కార్బోనేటేడ్ పానీయాలు, కెఫిన్, కొవ్వులు అధికంగా ఉండే ఆహారం, స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండండి. డెంగ్యూ నుంచి కోలుకున్నట్లయితే ఆల్కహాల్‌ను మానేయాలి. మీ రికవరీని ట్రాక్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ.. ఆహార అలవాట్లను మార్చుకోండి.
Also Read: IND vs BAN Highlights: కోహ్లీ మెరుపు సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం..
Also Read: Lava Blaze Pro 5G Price: బంఫర్ ఆఫర్ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook