Weight Loss Tips: శరీర బరువు, జీర్ణక్రియ, మానసిక ఆరోగ్యం సమస్యలకు కేవలం 25 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..

Curry Leaves Water For Weight Loss: చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే  ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కరివేపాకు టీని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టీని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2022, 11:29 AM IST
  • క్రమం తప్పకుండా కరివేపాకుతో తయారు
  • చేసిన టీ తాగితే శరీర బరువు, జీర్ణక్రియ, మానసిక ఆరోగ్యం
  • సమస్యలకు కేవలం 25 రోజుల్లో తగ్గించుకోవచ్చు.
Weight Loss Tips: శరీర బరువు, జీర్ణక్రియ, మానసిక ఆరోగ్యం సమస్యలకు కేవలం 25 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..

Curry Leaves Water For Weight Loss: కరివేపాకు వాసన చాలా గాఢంగా ఉంటుంది. అయినప్పటికీ వంటకాల రుచిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని భారతీయులు ఎక్కువగా సాంబార్, దోస, కొబ్బరి చట్నీ మొదలైన వాటిలో వినియోగిస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాలు పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి వ్యాధుల నుంచి శరీరాన్ని సులభంగా సంరక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ల అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి బరువును నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ఆకును టీల చేసుకుని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కరివేపాకు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

బరువు తగ్గుతారు:
కరివేపాకు నీరు బరువు తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉండడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా కరిగిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఈ నీటిని ట్రై చేయండి.

మెరుగైన జీర్ణక్రియ:
చాలా మంది ప్రస్తుతం వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుని జీర్ణ క్రియ సమస్యలతో బాధపడుతున్నారు. దీని వల్ల పొట్ట సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సమస్యకు చెక్‌ పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కరివేపాకు నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

బాడీ డిటాక్స్:
కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్‌ త్రాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. వాస్తవానికి ఈ ఆకులలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడతాయి. దీనిని క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు, ఫ్రీ రాడికల్స్ సమస్యలు తగ్గుతాయి.

మానసిక ఆరోగ్యం:
ప్రస్తుత చాలా మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కరివేపాకుతో చేసిన జ్యూస్‌ను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది టెన్షన్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Kalpika Ganesh Pics: కల్పిక గణేష్ హాట్ ఫొటోస్.. తెలుగమ్మాయిని ఇలా ఎప్పుడూ చూసుండరు!

Also Read: Actor Ali: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారుడిగా అలీ నియామకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

 

Trending News