COVID-19 infection: కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహహమ్మారి. కోట్లాది మంది ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడ్డారు. కొంత మందిలో ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపితే.. మరికొంత మందిలో స్వల్ప ప్రభావాన్ని మాత్రమే చూపుతోంది.
అయితే కరోనా వైరస్‌ను ఎదుర్కోవడం మానవ శరీరానికి అంత సులువేం కాదంటున్నారు నిపుణులు. ఈ వైరస్ సోకినప్పుడు శ్వాసకోశ సంబంధి సమస్యలు మాత్రమే అధికంగా వచ్చినా.. దీర్ఘ కాలంలో అనేక అవయవాలు దీని బారిన పడే అవకాశముందని అంటున్నారు. కొవిడ్ నుంచి రికవరీ అయిన తర్వాత.. జుట్టు రాలడం మొదలుకుని అనేక సమస్యలకు దారితీయొచ్చని వైద్యులు చెబుతున్నరు.
కొవిడ్ నుంచి రికవరీ అయిన వారిపై జరిపిన ఓ అధ్యాయనంలో మరో ఆందోళకరమైన విషయం బయటపడింది. పురుషుల్లో కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత శుక్రకణాల సంఖ్య తగ్గుదల నమోదవ్వొచ్చనే విషయం తెలిసింది.
అధ్యాయనంలో తేలిన మరిన్ని విషయాలు..
ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యాయనంలో.. కరోనా నుంచి కోలుకున్న పురుషుల్లో రెండు నెలల తర్వాత కూడా పలు సమస్యలు తలెత్తే అవకాశముందని ఈ అధ్యాయనం పేర్కొంది. ముఖ్యంగా శుక్రకణాల సంఖ్య తగ్గిపోడవం (COVID-19 can reduce sperm Count ) వాటి చలనశీలత క్షీణించడం వంట పరిణామాలు ఎదురవ్వచ్చని అధ్యాయనం వివరించింది.
తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఉన్న 120 మంది బెల్జియన్ పురుషులపై ఈ అధ్యాయనం జరిగింది. అధ్యాయనానికి ముందు.. ఆయా వ్యక్తుల ఎటువంటి కొవిడ్ లక్షణాలు లేకుండా ఉన్నట్లు తెలిసింది. ఈ స్టడీలో పాల్గొన్న వారి సగటు వయసు 18 నుంచి 69 ఏళ్ల మధ్య ఉంది.
అధ్యాయనం జరిగిందిలా..
ఈ స్టడీ ముగుసే సరికి ఎనిమది మంది తాము సంతోనోత్పపత్తి సమస్యలు (Corona impact on Men) ఎదుర్కొన్నట్లు తెలిపారు. చాలా మందికి ఎలాంటి ఇన్పెక్షన్లు లేవు. అధ్యాయనంలో పాల్గొన్న 5 మంది మాత్రం కొవిడ్ కారణంగా హస్పిటల్లో చేరారు.
అధ్యయనంలో భాగంగా.. పార్టిసిపేట్స్ నుంచి పలు సందర్భాల్లో వీర్యం, రక్త నమూనాలు సేకరించారు నిర్వాహకులు. దీనితోపాటు ఆయా వ్యక్తుల కొవిడ్ లక్షణాల గురించి కూడా సేకరించారు.
కొవిడ్ నుంచి కోలుకున్న వారం తర్వాత మొదటి నమూన తీసుకున్నారు. ఇందులో శుక్రకణాల సంఖ్య, వాటి కదలికపై పరిశోధన చేశారు నిపుణులు.
ఇంకా ఏం గుర్తించారంటే..
కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మొదటి నెలలోనే 60 శాతం వ్యక్తుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గటం, చలనశీలత క్షీణత వంటి సమస్యలను గుర్తించారు. ఒకటి నుంచి 2 నెలల మధ్య 37 శాతం మందిలో ఇదే సమస్య తలెత్తినట్లు నిర్ధారించారు.
28 శాతం మందిలో రెండు నెలలు అంతకన్నా ఎక్కువ సమయం తర్వాత కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నట్లు నివేదిక పేర్కొంది. కరోనా తీవ్రత సబంధం లేకుండా దాదాపు అందరిలో ఒకే విధమైన సమస్య తలెత్తినట్లు వివరించింది.
సంతాన సమస్య వస్తుందా?
గతంలో కూడా ఇలాంటి పరిశోధనలు జరిగాయి. కరోనా తొలినాళ్లలో కొవిడ్ రోగులపై పలు పరిశోధనలు జరగ్గా.. వాటిల్లో కూడా పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గటం గుర్తించారు. అయితే దీని వల్ల సంతాన యోగంపై ప్రభావం చూపుతుందనేది చెప్పలేదమని స్పష్టం చేశాయి అధ్యాయనాలు. ఈ విషయాన్ని అర్థం చేసుకునేందుకు మరింత లోతుగా పరిశోధనల అవసరమని వివరించాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఇలాంటి ప్రభావం కొన్ని నెలల పాటు మాత్రమే ఉంటుందని.. ఆ తర్వాత తిరిగి సాధారణం పరిస్థితులు నెలకొంటాయని అధ్యాయనాల్లో కీలకంగా వ్యవహరించిన పరిశోధకులు చెబుతున్నారు.
Also read: Heart attack signs: ఈ లక్షణాలు కనిపిస్తే హార్ట్ ఎటాక్ రావచ్చంట జాగ్రత్త!
Also read: 16 Crucial Vitamins: అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే 16 కీలకమైన విటమిన్లు ఏవో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook