కరోనా వైరస్( Corona virus ). ఇప్పుడు ప్రపంచాన్ని గజగజవణికిస్తున్నదిదే. ఇప్పటికైతే వ్యాక్సీన్ లేదా మందు లేదు కాబట్టి భయపడుతున్నారనుకుంటే ఓకే. కానీ చైనా వైద్యుల అధ్యయం వింటే ఆ రెండూ వచ్చాక కూడా లేదా కరోనా నుంచి బయటపడ్డాక ఆ సవాళ్లు..ఆ సమస్యల్ని ఎదుర్కోవల్సిందేనట. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ మరి.
కరోనా మహమ్మారి ( Corona pandemic ) నుంచి ప్రపంచం ఇంకా బయటపడనే లేదు. వ్యాక్సిన్( Vaccine ) లేదా మందు ( Medicine )ఇంకా కనుగొనలేదు. అప్పుడే ఇదే వైరస్ గురించి కొత్త నిజాలు వెలుగుచూస్తున్నాయి. వెన్నులో భయం పుడుతోంది. కరోనా నుంచి బయటపడ్డామని ఊపిరిపీల్చుకోవద్దు. అదే మీకు ఊపిరాడకుండా చేస్తుంది భవిష్యత్ లో. తగ్గింది కదా అని గుండెల నిండా గాలి కూడా పీల్చుకోకుండా చేస్తుంది. ఆశ్చర్యంగా ఉందా. నిజమే. వింటే భయం కలుగుతుంది మరి.
అవును..కరోనా కొత్త సవాళ్లు విసురుతోంది. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిలో చాలామందికి హృదయ సంబంధ సమస్యలు ( Cardiac problems ) తలెత్తుతున్నట్టు ఇటీవలే ఓ పరిశోధన వెల్లడించింది. ఇప్పుడు తాజాగా మరో అంశం కాస్తా వెలుగుచూసింది. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారికి ఊపిరితిత్తుల సమస్యలు ( Lung infections ) తలెత్తుతున్నట్టు ఓ అధ్యయనం చెబుతోంది. కరోనా వైరస్ పుట్టినటువంటి చైనా దేశపు వుహాన్ ( Wuhan ) లో చేసిన పరిశోధనల్లో ఇది వెల్లడైంది. వుహాన్ కు చెందిన జాంగ్ హాన్ హాస్పటల్ వైద్య నిపుణుల బృందం ( Jonghon hospital doctors ) చేసిన అధ్యయనం ఇది. వుహాన్ యూనివర్సిటీ ( Wuhan university ) కు చెందిన ఈ హాస్పిటల్ చేసిన అధ్యయనం ప్రకారం...కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిలో 90 శాతం మంది లంగ్స్ అంటే ఊపిరితిత్తుల సమస్యను ఎదుర్కొంటున్నారని...ఆ కారణంగా వీరిలో 5 శాతం మంది తిరిగి క్వారెంటైన్ కు వెళ్లాల్సివచ్చిందని పరిశోధనలో తేలింది. కరోనా వైరస్ నుంచి కోలుకున్న పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించగా...90 శాతం మందికి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిని ఉన్నట్టు గుర్తించారు. హెల్తీ పర్సన్ కు పనిచేస్తున్నట్టుగా వీరి ఊపిరితిత్తులు పనిచేయడం లేదని తెలిసింది. కరోనా నుంచి కోలుకున్నవారి ఊపిరితిత్తుల్లో వాయు ప్రసరణ గానీ, గ్యాస్ బదలాయింపు విధులు కానీ సక్రమంగా లేవని గుర్తించారు. Also read: Russian Scientists: గోరువెచ్చని నీరే కరోనా వైరస్ కు మందు
ఇలా కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిని 6 నిమిషాల పాటు నడిపించి చూసినప్పుడు కేవలం 4 వందల మీటర్లకే అలసిపోయారు. ఆరోగ్యవంతులైతే ఆ సమయంలో 5 వందల మీటర్ల వరకూ నడవగలిగేవారు. వైరస్ నుంచి కోలుకున్నవారిలో బి కణాలు తక్కువ స్థాయిలో ఉండటం, ఇంకా రోగ నిరోధక శక్తి కుదుటపడకపోవడాన్ని గమనించారు పరిశోధకులు. మరి కొంతమందికి అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ( corona patients after discharge ) అయిన తరువాత కూడా 3 నెలల వరకూ ఆక్సిజన్ అందించాల్సివచ్చింది. వీరిలో ఇంకొంతమందికి యాంటీబాడీలు కూడా కనుమరుగైపోయాయి.
అంటే కరోనా వైరస్ ఒకసారి మనిషి శరీరంలో ప్రవేశించాక..అది దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుందని..మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయదని అధ్యయనం చెబుతోంది. కరోనా వైరస్ రాకముందు ఊపరితిత్తుల సమస్యలు లేనివారు...కరోనా వైరస్ సోకి బయటపడిన తరువాత ఆ సమస్యను ఎదుర్కోవడం నిజంగా ఆందోళన కల్గించే పరిణామమే. సో బీ కేర్ ఫుల్...స్టే హోమ్..బీ సేఫ్. Also read: Sanitizers: శానిటైజర్స్ అతిగా వాడుతున్నారా ? ఐతే ఇది చదవండి