Constipation Treatment: మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా.. ఇలా సులభంగా విముక్తి పొందండి..!

Constipation Treatment: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల కలుషిత ఆహారాలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. దీని వల్ల కడుపు సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2022, 12:16 PM IST
  • మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా..
  • నీటిని ఎక్కువగా త్రాగాలి
  • ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి
Constipation Treatment: మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా.. ఇలా సులభంగా విముక్తి పొందండి..!

Constipation Treatment: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల కలుషిత ఆహారాలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. దీని వల్ల కడుపు సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా బయట లభించే జంక్‌ ఫుడ్‌, ఆయిల్ ఫుడ్‌ తినడం వల్ల పొట్టలో గ్యాస్‌ ఫామ్‌ అయ్యి అనేక శరీర సమస్యలు వస్తున్నయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి పలు రకాల ఆహార నిమాలను పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పొట్ట సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంలో ఏయే అంశాలను అనుసరించాలో తెలుసుకుందాం.

నీటిని ఎక్కువగా త్రాగాలి:

- శరీరానికి నీరు చాలా ముఖ్యమని అందరికీ తెలుసు. కాబట్టి రోజంతా తప్పనిసరిగా 7-8 గ్లాసుల నీరు త్రాగాలి. ఇలా తాగడం వల్ల మలబద్ధకం సమస్యలు తొలగిపోయే అవకాశాలున్నాయి.

- ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి.

- కడుపులో ఎప్పుడూ గ్యాస్ ఉండి.. మలబద్ధకం అనిపించే వారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని కోసం ఫైబర్ అధికంగా ఉండే వోట్మీల్, బార్లీ, బఠానీలు, బీన్స్, కాయధాన్యాలు, నిమ్మకాయలు, యాపిల్స్ వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

బాదం, బెర్రీలు కూడా తప్పనిసరిగా తినాలి:

పొట్టలో గ్యాస్‌ సమస్యను బాదంపప్పుతో కూడా అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ  సమస్యకు బెర్రీలను కూడా వినియోగించవచ్చని వారు పేర్కొన్నారు. వీటిల్లో చాలా రకాల విటమిన్లు ఉండడం వల్ల శరీరానికి మంచి లాభాలను ఇస్తుంది. అంతే కాకుండా కంటి చూపును కూడా మెరుగు పరుచుతుంది. కావున పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also read:High Cholesterol Treatment: చెడు కొలెస్ట్రాల్‌ నుంచి విముక్తి పొందడానికి రోజూ ఇలా చేయండి..!

 

Also read:Konda Film: రేవంత్ రెడ్డి పులి.. దయాకర్ రావుకు డైపర్లే! తీన్మార్ పంచ్ లతో కొండా డాటర్ పొలిటికల్ ఎంట్రీ? 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News