Constipation Relief In 5 Minutes: మలబద్ధకం సమస్య నుంచి 5 నిమిషాల్లోనే ఇలా ఉపశమనం పొందండి..!

Cure Constipation In 5 Minutes: మలబద్ధకం వల్ల శరీరంలో తీవ్రమైన అనారోరగ్య నమస్యలు వస్తాయి. అనారోగ్యకరమైన ఆహారం, శరీరంలో నీటి కోరత, ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ వహించక పోవడం కారణాల చేత  మలబద్ధకం నమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 25, 2022, 01:15 PM IST
  • మలబద్ధకం సమస్య నుంచి..
    ఎండు ద్రాక్ష, అలోవెరా జ్యూస్‌తో..
    10 నిమిషాల్లోనే ఉపశమనం
Constipation Relief In 5 Minutes: మలబద్ధకం సమస్య నుంచి 5 నిమిషాల్లోనే ఇలా ఉపశమనం పొందండి..!

Cure Constipation In 5 Minutes: మలబద్ధకం వల్ల శరీరంలో తీవ్రమైన అనారోరగ్య నమస్యలు వస్తాయి. అనారోగ్యకరమైన ఆహారం, శరీరంలో నీటి కోరత, ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ వహించక పోవడం కారణాల చేత  మలబద్ధకం నమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు తెలుపుతున్నారు. మలబద్ధకం వల్ల పొట్ట పూర్తిగా శుభ్రపడదు. ఈ సమస్యల వల్ల విచారం, నీరసం, అలసట వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఆధునిక జీవన శైలికారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ సమస్యలకు గురవడం విశేషం. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ ఇంటి నివారణలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వీటితో మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి:

అలోవెరా జ్యూస్:

కలబంద రసంలో అనేక రకాల పోషక విలువలుంటాయి. ఇది చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అయితే మలబద్ధకం సమస్యలతో బాధపడుతుంటే.. రెండు చెంచాల కలబంద రసం, రెండు చెంచాల నీటిలో కలిపి త్రాగాలి.  అంతేకాకుండా అలోవేర జ్యూస్‌ను కొబ్బరి నీటితో కూడా తీసుకోవచ్చు. అయితే ఈ కలబంద రసాన్ని ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి.

బాదం:

బాదంపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ప్రొటీన్లు, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే గుణాలు మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది. కావున ఈ సమస్యలతో బాధపడే వారు ఉదయం ఖాళీ కడుపుతో బాదంపప్పును తినవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒక రోజులో మధ్య వయసు వారు 4 నుంచి 5 బాదంపప్పులు, పిల్లలైతే.. 2 నుంచి 3 బాదంపప్పులు మాత్రమే తినాలి.

ఎండు ద్రాక్ష:

ఫైబర్ అధికంగా ఉండే ఎండుద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలుత శరీరాన్ని దృఢంగా చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే వీటిని తినడాని ముందు 10 నుంచి 20 నిమిషల పాటు నీటిలో తీసుకుంటే సమస్యలన్ని దూరమవుతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: రెచ్చిపోయిన అక్షర్ పటేల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం! విండీస్‌పై సిరీస్‌ కైవ

Also Read: Horoscope Today July 25 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఊహించని శుభవార్త వింటారు!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News