Cholesterol: రక్త వాహికల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుందా, వెంటనే వంటనూనె మార్చండి

Cholesterol: ఆధునిక జీవన విధానంలో చాలా రకాల వ్యాధులు ఉత్పన్నమౌతున్నాయి. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం, కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు సంభవిస్తుంటాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 6, 2024, 11:21 AM IST
Cholesterol: రక్త వాహికల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుందా, వెంటనే వంటనూనె మార్చండి

Cholesterol: మనిషి ఎదుర్కొనే అనారోగ్య సమస్యలకు మూల కారణం కొలెస్ట్రాల్. ఒక్క కొలెస్ట్రాల్ కారణంగా రక్తపోటు, మధుమేహం, కిడ్నీ వ్యాధులు, గుండె వ్యాధులు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రించగలిగితే చాలా సమస్యలు దూరమైనట్టే. అసలు శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

మన దేశంలో ఆయిల్ లేకుండా ఆహార పదార్ధాలు ఉండనే ఉండవు. తినే ప్రతి ఆహారంలో ఆయిల్ ఉండాల్సిందే. అందుకే రక్త వాహికల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. రక్త వాహికల్లో కొలెస్ట్రాల్ పేరుకున్నప్పుడు ముందుగా రక్తపోటు పెరుగుతుంది. క్రమంగా అది హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, కరోనరీ ఆర్టరీ వ్యాధులు, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్, మధుమేహానికి దారి తీస్తుంది. ఈ సమస్యల్నించి బయటపడాలంటే కొలెస్ట్రాల్ ఉండకూడదు. ఆహారపు అలవాట్లు మార్చడమే కాకుండా కుకింగ్ ఆయిల్ మార్చాల్ని వస్తుంది. కుకింగ్ కోసం ఏ నూనె వాడటం మంచిదో పరిశీలిద్దాం.

ఆలివ్ ఆయిల్‌ను సాధారణంగా విదేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇండియాలో ఆలివ్ ఆయిల్ వినియోగం చాలా తక్కువ. కారణంం ఉత్పత్తి తక్కువగా ఉండటమే. ఆలివ్ ఆయిల్‌ను మిడిల్ ఈస్ట్, మెడిటేరియన్ దేశాల్నించి దిగుమతి చేసుకోవల్సి వస్తుంది. అయితే ఆరోగ్యరీత్యా ఆలివ్ ఆయిల్ చాలా చాలా మంచిది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే వంటి పోషకాలు చాలా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. 

ఇక రెండవది వేరు శెనగ నూనె. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వంటలు రుచిగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ, ఫైటోస్టెరోల్ కారణంగా ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. 

ఇక మూడవది ఫ్లక్స్ సీడ్స్ ఆయిల్. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆయిల్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించాలంటే రోజువారీ డైట్‌లో ఫ్లక్స్ సీడ్స్ తప్పకుండా చేర్చాలి. అయితే ఫ్లక్స్ సీడ్స్ ఆయిల్‌ను అధిక ఉష్ణోగ్రత వద్ద వండకూడదు. ఫ్రిజ్‌లో కూడా ఉంచకూడదు.

Also read: Liver Damage: శరీరంలో ఏ విటమిన్ ఎక్కువైతే లివర్ దెబ్బతింటుందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News