How To Prevent Cholesterol And Heart Attack In Winters: మన దేశంలో ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజూ తినడం వల్ల చాలా మందిలో కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు, గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలు సిరల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్తనాళాల్లో పలు రకాల సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా చాలా మందిలో గుండెపోటు వస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవాల్సి ఉంటుంది.
ఛాతీ నొప్పి:
మన శరీరంలోని కరోనరీ ధమనులు మృదువైన కండరాలతో కలుస్తాయి. దీని కారణంగా గుండెకు శక్తి, ఆక్సిజన్ అందుతాయి. అయితే శీతాకాలంలో వాటి రక్త సరఫరాలో మార్పులు వస్తాయి. దీని కారణంగా సిరల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగి ఛాతీ నొప్పికి దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి చలి కాలంలో గుండె సమస్యలతో బాధపడేవారు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
సిరలు తగ్గిపోతాయి:
చలికాలంలో చాలా మందిలో రక్తనాళాలు కుంచించుకుపోవడం మొదలవుతాయి. దీని కారణంగా చాలా మందిలో శరీరానికి రక్త సరఫరాలో మార్పులు వస్తాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్య తలెత్తుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో వృద్ధులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
తక్కువ వెలుతురు కూడా ఒక పెద్ద కారణం:
చలికాలంలో పగలు తక్కువగానూ, రాత్రులు ఎక్కువగానూ ఉంటాయని మనందరికీ తెలుసు. ఈ కారణంగా శరీరంలో హార్మోన్ల సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కార్టిసాల్ తక్కువగా విడుదలవుతుంది. దీంతో సులభంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
వ్యాయామాలు చేయకపోవడం:
వింటర్ సీజన్‌లో చాలా మంది బద్ధకంగా తయారవుతారు. అయితే ఈ క్రమంలో చాలా మంది వ్యాయామాలు కూడా చేయడం మానుకుంటారు. ఇలా శరీరక శ్రమ తగ్గిపోవడం వల్ల కూడా గుండె పోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా పలు చలి కాలంలో వ్యాయామాలు చేయడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శీతాకాలంలో గుండెపోటును ఎలా నివారించాలి?
శీతాకాలంలో చలి నుంచి గుండె పోటు ఉన్నవారు శరీరాన్ని రక్షించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మీరు ఉన్న దస్తువులను ధరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రతి రోజూ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గి గుండె పోటు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Jamuna Death : జమున మరణం.. చిరు, బాలయ్య, పవన్ సంతాపం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
Also Read: KGF Vasishta Wedding : నాని హీరోయిన్‌ను పెళ్లాడిన కేజీయఫ్ నటుడు వశిష్ట.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook