Kids summer care tips : వేసవికాలం అంటేనే గుర్తొచ్చేది ఈ మండే ఎండలు. సూర్యుడి వేడి రోజు రోజుకి.. పెరుగుతూ వస్తోంది.. తప్ప తగ్గడం లేదు. ఉదయం నుంచే భాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ వస్తున్నాడు. ఎండ వేడి తట్టుకోలేక పెద్దలకే వడదెబ్బ తగులుతూ ఉంటుంది.. అలాంటిది చిన్నపిల్లల పరిస్థితి ఏమిటి ఆలోచించండి. అందుకే వారి విషయంలో బోలెడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా చిన్నపిల్లలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అది అంత కష్టమైన పని కాకపోవచ్చు కానీ.. పిల్లలను వేడి నుంచి కాపాడటానికి తల్లిదండ్రులుగా మనం పాటించాల్సిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకుందాం.
తరచుగా మంచినీళ్లు తాగమని పిల్లలకి చెబుతూ ఉండండి. వారు బయటకు వెళ్లినా కూడా వాళ్లతో పాటు వాటర్ బాటిల్స్ తీసుకెళ్లమని దారిలో కూడా తాగమని వారిని ప్రోత్సహించండి. ఎండ వేడి తట్టుకోలేక కొందరు పిల్లలు కూల్ డ్రింక్స్ వంటివి తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ కూల్ డ్రింక్స్ వల్ల భవిష్యత్తులో వచ్చే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని వీలైనంతవరకు ఎవాయిడ్ చేయండి.
వేసవిలో తేలికైన దుస్తులు వేసుకోవడం చాలా మంచిది. కాటన్, నారా వంటి బట్టలు శరీరంలోకి ఎక్కువగా ఉష్ణోగ్రతను పీల్చుకోకుండా ఉంటాయి. పిల్లలకి కూడా సహజమైన తేలికైన బట్టలు వేయండి.
ముఖ్యంగా ఎండ వేడి ఎక్కువగా ఉండే సమయంలో పిల్లలను బయటకు వెళ్లడానికి నిరాకరించండి. ఇంట్లోనే ఆడుకునే లాగా ఏదైనా ఇండోర్ గేమ్స్ లో వాళ్లని ఎంగేజ్ చేయండి. కచ్చితంగా బయటకు వెళ్లాల్సి వస్తే టోపీలు, గొడుగులు వంటివి ఉపయోగించి ఎక్కువ ఎండ వారి మీద పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు ఎండ వేడి వల్ల పిల్లలకు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. కాబట్టి వారిలో తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, కళ్ళు తిరగడం, మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తే..వెంటనే వైద్య నిపుణుల సహాయం తీసుకోవడం ఉత్తమం.
Also Read: YSRCP Manifesto: మేనిఫెస్టోను 99 శాతం అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: వైఎస్ జగన్
Also Read: Pithapuram: పవన్ కల్యాణ్‌కు భారీ షాక్.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter