Calcium Rich Foods: క్యాల్షియం పుష్కలంగా ఉండే 7 ఆహారాలు.. ఇవి ఎముక ఆరోగ్యానికి ఎంతో మేలు..

Calcium Rich Foods: ఆరోగ్యకరమైన ఎముకల కోసం క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి అంటారు. ఎందుకంటే ఎముక ఆరోగ్యంతో పాటు కండరాల నిర్మాణానికి కాల్షియం ఎంతో అవసరం.

Written by - Renuka Godugu | Last Updated : Jun 12, 2024, 09:09 PM IST
Calcium Rich Foods: క్యాల్షియం పుష్కలంగా ఉండే 7 ఆహారాలు.. ఇవి ఎముక ఆరోగ్యానికి ఎంతో మేలు..

Calcium Rich Foods: ఆరోగ్యకరమైన ఎముకల కోసం క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి అంటారు. ఎందుకంటే ఎముక ఆరోగ్యంతో పాటు కండరాల నిర్మాణానికి కాల్షియం ఎంతో అవసరం. పాల పదార్థాలు ముఖ్యంగా పాలు చీజ్ లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు కొన్ని రకాల పండ్లలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ 7 రకాల ఆహార పదార్థాలు డైట్లో చేర్చుకోవడం వల్ల మీ శరీరానికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది. ఇది ఎముక ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో అవసరం. 

ఆరెంజ్..
ఆరెంజ్ రుచిగా ఉండటమే కాకుండా ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఆరెంజ్ లో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఒక మీడియం సైజులో 52 మిల్లీగ్రామ్స్ క్యాల్షియం ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ రూపంలో తీసుకున్న మీకు క్యాల్షియం లెవెల్స్ అందుతాయి. ఇది ఎముక ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఫిగ్స్..
ఫిగ్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటే అంతే కాదు. ఇందులో కాల్షియం కూడా ఉంటుంది ఒక పండిన ఫిగ్గు లేకపోతే డ్రైడ్ ఫిగ్గు ఏదైనా తీసుకోవచ్చు ఇదే ఎముక ఆరోగ్యానికి మంచి ఖనిజం. 3 ఫిగ్స్ లో 50 మిల్లీగ్రామ్స్ క్యాల్షియం ఉంటుంది ఫిగ్స్ మనం స్నాక్ రూపంలో తీసుకోవచ్చు. ఒక ఫిగ్స్ లో పొటాషియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముక ఆరోగ్యానికి మంచిది.

కివి..
కివిలో కూడా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రుచికరంగా మనకి ఉంటుంది అంతేకాదు ఇందులో క్యాల్షియం ఉంటుంది ఒక మీడియం సైజ్ కివీలో 60 మిల్లీగ్రామ్ ల కాల్షియం ఉంటుంది. కీవీలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి ఆరోగ్యానికి మంచిది.

ఇదీ చదవండి: Homemade Hair Conditioners: ఇంట్లోనే తయారు చేసుకునే ఈ కండిషనర్ తో మీ జుట్టు పట్టులా మెరిసిపోతుంది..  

ప్రూన్స్..
ప్రూన్స్ జీర్ణ ఆరోగ్యానికి మంచిది. ఇందులో కాల్షియం ఉంటుంది. ప్రూన్స్ లో మూడు మిల్లీగ్రామ్ల క్యాల్షియం ఉంటుంది ఫ్రూన్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాల్షియం మన శరీరానికి అందుతుంది.

ఆప్రికాట్స్..
ఆఫ్రికాట్స్‌ లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఎముక అభివృద్ధి కూడా సహాయపడుతుంది. ఒక డ్రై ఆఫ్రికాట్స్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పండిన ఆఫ్రికాట్స్‌ని కూడా తీసుకోవచ్చు క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది తీసుకుంటే శరీర ఆరోగ్యానికి మంచిది.

మల్బరీస్..
మల్బరీస్‌లో కూడా క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పుకి మల్బరీస్‌లో 55 గ్రా మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది అంతే కాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ ఉంటాయి ఆరోగ్యానికి మంచిది.

ఇదీ చదవండి: Liver Damage Foods: ఆల్కహాల్ కాదు ఈ 6 ఆహారాలు తీసుకుంటే మీ లివర్ డ్యామేజ్ అయినట్టే..  

బ్లాక్బెర్రీస్..
బ్లాక్ బెర్రీస్ లో కూడా క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు బ్లాక్ బెర్రీస్ లో 42 మిల్లీగ్రామ్ ల కాల్షియం ఉంటుంది అంతేకాదు ఇందులో ఫైబర్ మన శరీరానికి అవసరమైన ఖనిజాలు కూడా ఉంటాయి. బ్లాక్ బెర్రీస్ ఎముక ఆరోగ్యానికి కూడా మంచివి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News