Kitchen Remedies For Headache: మనలో చాలా మంది తీవ్రమైన తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మందులు, మాత్రలు ఉపయోగిస్తారు. తలనొప్పి అనేది కొందరు కంప్యూటర్ ని ఎక్కువగా ఉపయోగించినప్పుడు, ఫోన్‌ను ఎక్కువసేపు వాడినప్పుడు, రాత్రిపూట సరిగ్గా నిద్రలేనప్పుడు ఈ సమస్య కలుగుతుంది.
తలనొప్పి అనేది సాధారణ సమస్య అయినప్పటికీ దీని వల్ల కలిగే నొప్పి ఎంతో ఇబ్బంది కరణంగా ఉంటుంది. అయితే ఈ సమస్య తగ్గించుకోవాలి అనుకొనే వారు మనం ఇంటిలో లభించే కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే ఎలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనేది మనం తెలుసుకుందాం.
ఇంట్లో లభించే మసాలాను ఉపయోగించడం వల్ల ఈ తల్లనొప్పి సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
లవంగం:
మీరు తీవ్రమైన తలనొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఇంట్లో లభించే లవంగంను ఉపయోగించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. లవంగాలు తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలితగిస్తుంది. లవంగంలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీని వల్ల తలనొప్పి తగ్గుతుంది.
అల్లం :
అల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యల అయిన వెంటనే తగ్గుతాయి. తలనొప్పి ఉన్నప్పుడు మీరు ఇంట్లో అల్లం తీసుకొని దీంతో పాటు దాల్చిన చెక్క తీసుకొని టీ తయారు చేసుకొని తాగడం వల్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
నిమ్మకాయ నీరు:
నిమ్మకాయ అలాగే నీళ్ళు తీసుకోవడం వల్ల తలనొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. నీళ్ళు కలిపి తాగితే తలనొప్పి తగ్గుతుంది. ఎందుకంటే కొన్ని సార్లు కడుపులో గ్యాస్ సమస్య వచ్చనప్పుడు తలనొప్పికి దారి తీస్తుంది.
Also Read Intermittent Fasting: మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ మంచిదా కాదా
బ్లాక్ టీ:
బ్లాక్ టీలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉపశమనం పొందడానికి మీరు మీ నుదిటిపై నిమ్మకాయను రుద్దవచ్చు.
ఈ విధంగా మీరు తలనొప్పి సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ చిట్కాలను ఉపయోగించవచ్చు.దీని వల్ల తలనొప్పి సమస్య తగ్గుతుంది. మీరు వీటిని మీ ఇంట్లో లభించే పదార్థాలు తప్ప బయట ఎలాంటి పదార్థాలు ఉపయోగించే అవసరం లేదు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter