Benefits Of Boiled Lemon Water: మన ఇంట్లో నిమ్మకాయను ఉపయోగించి ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాం. ముఖ్యంగా పులిహోర, శర్బత్ చేసుకుంటాం. అయితే నిమ్మకాయతో చేసిన ఆహార పదార్థాలు మన శరీరాని ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే నిమ్మకాయను ఇక్కడ చెప్పిన విధంగా వాడటం వల్ల కొన్ని వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి నిమ్మకాయలను ఏ విధంగా ఉపయోగించాలి..? అనే విషయంపై మనం తెలసుకుందాం.
✿ వేడి చేసిన నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలను శుభ్రం అవుతాయి.
✿ నిమ్మరసం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను పెరగకుండా సహాయపడుతుంది.
✿ నిమ్మకాయల నుంచి విటమిన్ సి, న్యూటియన్స్, మినరల్స్‌ను పొందవచ్చు.
Also read: Asthma: ఈ చిట్కాలు పాటించడం వల్ల ఆస్తమా బాధితులు ఇన్హెలర్‌లను, మందులకు చెక్!
అయితే నిమ్మకాయలను ఉడికించిన పానీయం తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందువచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎలా తయారు చేసుకోవాలి అంటే? నిమ్మకాయలను శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని ఒక గిన్నెలో నీరు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక నిమ్మకాయ ముక్కలను, అల్లం ముక్కలను, దంచిన వెల్లెల్లి రెబ్బలను వేసుకోవాలి. 10 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ఒక గ్లాసులో తీసుకోవలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి తాగాలి. దీనిని ఉదయం పరిగడుపున తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
✿ దీని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి.
✿ ఈ జ్యూస్ తాగడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం.
✿ దీని తాగడం వల్ల లివర్ కూడా శుభ్రం చేస్తుంది.
✿ ఈ జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Diabetes Drinks: రోజూ ఈ 5 డ్రింక్స్ తాగితే డయాబెటిస్ ఎంత ఉన్నా ఇట్టే నియంత్రణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook