Black Raisins For Diabetes Control: శీతాకాలం చాలా రకాల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. వాతావరణంలో తేమ కారణంగా ఫంగస్, బ్యాక్టీరియా పెరిగి తీవ్ర వ్యాధులు బారి పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు వహించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఫంగస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల నుంచి ఎండుద్రాక్షతో సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన పాలీఫెనాల్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటి అనేక పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఆహారాల్లో ఎండు ద్రాక్షను వినియోగించడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా వినియోగిస్తే శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లాక్ రైసిన్ ప్రయోజనాలు:
1. ఎండుద్రాక్షలో ఉండే పీచు పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా వినియోగిస్తే గ్యాస్, ఉబ్బరం, అపానవాయువు, మలబద్ధకం, అజీర్ణం వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుతాయి. దీంతో శరీరం దృఢంగా తయారవుతుంది.
2. ఎండుద్రాక్ష మధుమేహం, అల్జీమర్స్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అయితే దీని కోసం ఎండు ద్రాక్షలను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల శరీరం ఫిట్‌గా తయారవుతుంది.
3. ఎండుద్రాక్ష నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మలబద్ధం సమస్యలు సులభంగా నయమవుతాయి. అంతేకాకుండా పొట్ట సమస్యలు తగ్గిపోయి. శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారికి ఔషధలా పని చేస్తుంది. ఎండుద్రాక్షలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఇవి చర్మాన్ని మెరుగుపరుస్తాయి.
4. ఎండుద్రాక్షలో శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే మూలకాలుంటాయి. కాబట్టి వీటిని పాలతో వేడి చేసి.. పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢపరుస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో.
Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook