Best Way To Lose Belly Fat: బరువు తగ్గించడానికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సులభంగా బరువు తగ్గడానికి అందరిలా కాకుండా నిమ్మకాయ రసాన్ని వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీర బరువును నియంత్రించడానికి నిమ్మ తొక్క కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ తొక్కల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. నిమ్మ తొక్కలో డి-లిమోనెన్ అనే మూలకం శరీరంలో పేరుకుపోతున్న కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రిస్తుంది. అయితే ఆరోగ్యంగా బరువు తగ్గడానికి నిమ్మతొక్కలను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరం నుంచి టాక్సిన్స్ తొలగిస్తుంది:
నిమ్మ తొక్కలలో ఫ్లేవనాయిడ్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా వినియోగిస్తే ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. అయితే ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా నిమ్మతొక్కలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవాలనుకునేవారు తప్పకుండా నిమ్మకాయ తొక్క ఆహారంలో వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు.
నిమ్మ తొక్క పౌడర్‌ను కూడా బరువు తగ్గడానికి కూడా వినియోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఈ పౌడర్‌లో విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ పొడిని తయారు చేయడనికి ముందుగా తొక్కలను ఎండబెట్టి పొడి చేసి గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోవాలి. అయితే దీనిని గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగితే బరువు చెక్ పెట్టొచ్చు.
ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలి..?:
బరువును తగ్గించుకోవడానికి ముందుగా నిమ్మకాయలను తొక్కలు వేరు చేయాలి. ఆ తర్వాత పొడి చేసి..ఆ పొడిని 2 లీటర్ల నీటిలో సుమారు 30 నిమిషాలు ఉడకబెట్టండి. ఆ తర్వాత చల్లారాకా ఇందులో తేనె కలుపుకుని తాగితే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గుతారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Samantha Cries: అంతా అయిపోయింది అనిపించింది.. అరుదైన వ్యాధి గురించి చెబుతూ ఏడ్చేసిన సమంత!
Also Read : Bigg Boss Faima : నామినేషన్లో దిగజారుతూనే ఉన్నారు.. ఒళ్లు మరిచిపోతోన్న ఫైమా, శ్రీహాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook