Pudina Benefits: పుదీనాను ఇలా వాడితే చాలు..అజీర్ణం, కడుపు నొప్పి సమస్యలు దూరం

Pudina Benefits: వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా అజీర్ణం పెద్ద సమస్యగా మారుతోంది. అయితే ఇంట్లో నిత్యం లభించే పుదీనాతో అజీర్ణానికి చెక్ చెప్పవచ్చు. పుదీనాలోని పోషక పోషక గుణాలు కడుపుకు సంబంధించి చాలా సమస్యల్ని దూరం చేస్తాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 27, 2022, 05:44 PM IST
Pudina Benefits: పుదీనాను ఇలా వాడితే చాలు..అజీర్ణం, కడుపు నొప్పి సమస్యలు దూరం

Pudina Benefits: వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా అజీర్ణం పెద్ద సమస్యగా మారుతోంది. అయితే ఇంట్లో నిత్యం లభించే పుదీనాతో అజీర్ణానికి చెక్ చెప్పవచ్చు. పుదీనాలోని పోషక పోషక గుణాలు కడుపుకు సంబంధించి చాలా సమస్యల్ని దూరం చేస్తాయి.

కడుపులో నొప్పి..తరచూ వినే సమస్య. గ్యాస్ లేదా మలబద్ధకం కావచ్చు. అయితే అజీర్ణం కూడా కడుపు నొప్పికి కారణమౌతుంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు పుదీనా అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. పుదీనా ఆకులు అజీర్తి సమస్య దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా..కడుపు నొప్పిని కూడా దూరం చేస్తాయి.  అయితే అజీర్ణం సమస్యను దూరం చేసేందుకు పుదీనా ఆకుల్ని ఎలా వాడాలో తెలుసుకుందాం.

అజీర్ణ సమస్యకు పుదీనా ఎలా వాడాలి

ముందుగా నీళ్లు ఉడికించుకుని, అందులో పుదీనా ఆకుల్ని వేయాలి. పది నిమిషాల అనంతరం..వడపోసి..కొద్దిగా నిమ్మకాయ పిండుకుని తాగాలి. రెండవ విధానం 6-7 పుదీనా ఆకుల్ని బాగా కడిగి క్రష్ చేయాలి. తరువాత ఒక బౌల్‌లో వేసి..అందులో గోరువెచ్చని నీళ్లు కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల అజీర్ణ సమస్య పోతుంది. ఇక మూడవ విధానం పుదీనా ఆకుల్ని బాగా కడిగి..పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్‌ను ప్రతిరోజూ కొద్దిగా గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల అజీర్తి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

ఒకవేళ పుదీనా మీ ఆరోగ్యానికి పడకపోయినా..లేదా ఏదైనా ఇతర సమస్యలు ఎదురైనా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొందరికి కొన్ని పదార్ధాలు పడకపోవచ్చు.

Also read: Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పండ్లను తప్పకుండా తీసుకుంటే.. ఎలాంటి వ్యాధులు మీ చుట్టుముట్టవు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News